Gopala gopala audio release date confirmed

Gopala Gopala movie, Gopala Gopala Audio release, Gopala Gopala audio release date, Gopala Gopala release date, Gopala Gopala latest wallpapers, Gopala Gopala movie updates, Gopala Gopala teaser, Gopala Gopala latest song, pawan kalyan updates, pawan kalyan twitter

gopala gopala audio release date confirmed : gopala gopala movie unit announced that audio launch will be on february 4th. pawan kalyan venkatesh multi starrer movie will release on january 09th. gopala gopala movie shooting comes to end, cast and crew working hard to complete in time

ముహూర్తం ఫిక్స్ అయింది

Posted: 01/03/2015 09:26 AM IST
Gopala gopala audio release date confirmed

న్యూ ఇయర్ కానుకగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ప్రకటించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ పోస్టర్ తో పాటు మూవీలోని ఒక పాటను కూడా విడుదల చేశాడు. ఈ రెండిటికీ మంచి స్పందన వచ్చింది. సాంగ్ అయితే కెవ్వు.., కేక అని కామెంట్లు వస్తున్నాయి. గోపాలుడికి పాట పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుందని అంటున్నారు. ఒక్కపాటకే ఇంతగా క్రేజ్ వస్తే..,, మిగతా రెండు పాటలకు ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. ఫ్యాన్స్ ను ఎంతగానో ఊరిస్తున్న రెండు పాటల విడుదలకు సమయం ఆసన్నమయింది.

ఆదివారం రోజు ‘గోపాల గోపాల’ ఆడియో విడుదల అవుతుందని మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లేదా మరో హోటల్ లో ఈ కార్యక్రమం జరగనుంది. బిజీ షెడ్యూల్ షూటింగ్ కారణంగా ఇన్ని రోజులూ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించలేదు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో కాస్త ఫ్రీ అయి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న మూవీ.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల అవుతుంది. ‘ఓ మై గాడ్’ తెలుగు వర్షన్ ను కిశోర్ పర్ ఫెక్ట్ గా డైరెక్ట్ చేసి ఉంటాడని టాక్ విన్పిస్తోంది. ‘ఐ’కి పోటిగా తెలుగులో విడుదల అవుతున్న ఏకైక సినిమా ఇదే కావటం విశేషం. భారీ ప్రాజెక్టుతో పోటి పడుతుండటంతో సంక్రాంతికి ఎవరి కలెక్ష్క్షన్ల పంట పండనుందో సినిమా విడుదల అయితే తెలుస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala movie  pawan kalyan latest  venkates movies  

Other Articles