Varun tej second movie producer

Varun Tej Second movie, Varun Tej Second Movie updates, Varun Tej second movie shooting, Varun Tej updates, Varun Tej movies, puri jagannath movies, puri jagannath upcoming movies, tollywood updates, upcoming telugu movies

Varun Tej second Movie producer : Mega prince Varun Tej second movie will be produced by C.Kalyan. Varun Tej second movie starts soon in Puri Jagannath Direction. Varun third movie will be directed and produced by krish

ప్రిన్స్ కోసం ప్రొడ్యూసర్ల పోటి.. రెండో సినిమా వరమెవరికి...?

Posted: 01/02/2015 03:58 PM IST
Varun tej second movie producer

మెగా ప్రిన్స్ తొలి సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోకపోయినా., పర్వాలేదు అన్పించుకుంది. తొలి సినిమా చేస్తుండగానే.., తర్వాతి ప్రాజెక్టుల కోసం నాగబాబు ఏర్పాట్లు చేశాడు. పూరీ జగన్నాథ్, క్రిష్ తో సినిమాలు రెడిగా ఉన్నాయి. ఇద్దరిలో సెకండ్ సినిమా క్రిష్ తో ఉంటుందని టాక్ విన్పిస్తుంది. ఇప్పుడీ ప్రాజెక్టుపై చాలామంది కన్నేశారు. ప్రిన్స్ సినిమాను మేము నిర్మిస్తామంటే, మేము అని కర్చీఫ్ లు టవళ్లు, ఏకంగా సెంటిమెంట్ దుప్పట్లు పరుస్తున్నారు. దీంతో అవకాశం ఎవరికి వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరుణ్ రెండవ సినిమా చేయాలని తహతహలాడుతున్నవారిలో అల్లు అరవింద్ ఉన్నారు. దగ్గరి బంధువైన అరవింద్ కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో రామ్ చరణ్ రెండవ సినిమాతో పాటు అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ రెండవ సినిమాలు కూడా ఆయనే తీశాడు. ఇవన్నీ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రావటంతో వరుణ్ రెండవ మూవీ కూడా తనకే ఇవ్వాలంటూ నాగబాబును కోరుతున్నాడట. ఇదే సమయంలో డి.వి.వి దానయ్య వంటి వ్యక్తులు కూడా కోరుతున్నాడట. ఈయనతో పాటు మిగతా వారు కూడా వరుణ్ సెకండ్ సినిమాకు డబ్బులు పెడతామంటూ.., మెగా ప్రిన్స్ కు ఫోన్లు చేస్తున్నట్లు టాక్ విన్పిస్తోంది.

ఇలా ఎవరికి వారు పోటిగా ఉంటే వీరందరికి పోటిగా మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే డైరెక్టర్ క్రిష్. మామూలుగా క్రిష్ తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ సినిమాకు కూడా ఆయనే ఉంటాడా.., లేక మిగతా వారికి అవకాశం ఇస్తాడా అనేది తెలియదు. సెకండ్ సినిమా క్రిష్ ది అయితే మాత్రం..., ప్రొడ్యూసర్స్ కాంపిటిషన్ చాలా టఫ్ గా ఉంటుందని చెప్పనవసరం లేదు. ఒకవేళ పూరీ జగన్నాథ్ తో రెండవ ప్రాజెక్టుకు రెడి అయితే సి.కళ్యాణ్ తో గీతా ఆర్ట్స్ పోటి పడుతుంది. మరి రెండవ సినిమా డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Puri Jagannath  Tollywood Updates  

Other Articles