Bellamkonda srinivas second movie director

Bellamkonda Srinivas, Bellamkonda Srinivas movies, Bellamkonda Srinivas second movie, Bellamkonda Srinivas sundarapandian movie, Bellamkonda Srinivas second movie diretor, Bheemineni Srinivasa Rao movies, Bheemineni Srinivasa Rao bellamkonda srinu movie, tollywood updates, upcoming telugu movies, Boyapati srinivas movie

bellamkonda srinivas second movie director : producer bellamkoda suresh son srinivas second movie will be sundarapandian telugu remake. srinivas second movie will be directed by bheemineni srinivasa rao in the place boyapati srinu. bheemineni now working on sundarapandian script for bellamkonda

సినిమా నుంచి ఆ శ్రీను పోయి ఈ శ్రీను వచ్చాడు

Posted: 01/02/2015 11:30 AM IST
Bellamkonda srinivas second movie director

బాలారిష్టాలు తొలగించుకునేందుకు బెల్లంకొండ శ్రీను గారు బాగా కష్టపడుతున్నారు. తొలి సినిమా బిగ్ ఫ్లాపుగా మిగలటంతో, రెండవ సినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. ముందుగా పెద్ద డైరెక్టర్ ను తీసుకున్నాడు. బాలయ్యకు సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి తనకు కూడా అదే రికార్డు అందిస్తాడని డేట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే వెయిటింగ్ చేయించటం నచ్చక డైరెక్టర్ శ్రీను వెళ్ళిపోయాడు. దీనికి రెమ్యునరేషన్ కూడా రీజన్ అని టాక్ విన్పిస్తోంది.. అది వేరే విషయం లెండి. ఒక శ్రీను సినిమా కోసం శ్రీను పోతేనేం, మరొక శ్రీను ఉన్నాడు అంటూ కొత్త డైరెక్టర్ ను తెచ్చేసుకున్నారు.

కంటెంట్ ప్లస్ కామెడి సినిమాలు తీసే., భీమినేని శ్రీనివాస్ బెల్లంకొండ బాబు సినిమాకు డైరెక్టర్ గా పనిచేస్తాడట. ఫిలింనగర్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా అంతా ఇవే గుసగుసలు మాట్లాడుకున్నారు. తొలి సినిమాను వినాయక్ చాలా హైప్ చేసినా.., దాన్ని అందుకోలేక హీరో బొక్కబోర్లా పడ్డాడు. బోయపాటితో ప్రయత్నమంటే ఆయన తీసుకెళ్లే ఎత్తులు అందుకోలేకపోతే, మరోసారి పరాభవం తప్పదనే ఇలా చేశాడట. భీమినేని అయితే నలుగుర్ని నవ్విస్తూ, అదే సమయంలో సినిమాను సింపుల్ గా తీసుకెళ్తాడు కాబట్టి ఆయన్ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

భీమినేని ట్రాక్ రికార్డు చూస్తే ‘సుస్వాగతం’ ‘శుభాకాంక్షలు’, ‘సూర్యవంశం’ ‘దొంగోడు’ ‘అన్నవరం’ ‘సుడిగాడు’ వంటి హిట్లు అందించాడు. ఇంకో విషయం ఏమిటంటే ఈ డైరెక్టర్ అన్నీ రీమేక్ లు తీస్తాడు. కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసి బాగా హిట్లు కొట్టాడు. రీమేక్ రాజాగా పేరుపొందిన భీమినేని శ్రీనివాస్ పై ఉన్న నమ్మకంతో సురేష్ సినిమాను అప్పగించాడు. కష్టాల్లో ఉన్నా కొడుకు సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. మరి వీరి ప్రయత్నం ఏమవుతుందో చూడాలంటే కొంతకాలం ఆగాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bellamkonda srinivas movie  Bheemineni Srinivas rao movie  Boyapati srinu  

Other Articles