Katrina kaif bollywood heros behaviour neatness

katrina kaif on bollywood heros, katrina kaif fires on bollywood heros, bollywood heros not baths brushes mouth, bollywood heros behaviour, bollywood heros habits, katrina kaif upcoming movie updates, bollywood latest updates

katrina kaif bollywood heros behaviour neatness : bollywood beauty katrina kaif reveals heros behaviour and maintance are very ugly many of heros are coming to set with swet and some of heros comes to sets without washing mouth

రొమాన్స్ కోసం ఓర్చుకుంటే వాంతులవరకూ వెళ్ళింది

Posted: 12/23/2014 01:20 PM IST
Katrina kaif bollywood heros behaviour neatness

మొహమాటానికి పోతే కడుపు వచ్చిందన్నట్లుగా.., పోనీలే కదా అని అడ్జస్ట్ చేసుకుంటే విషయం వాంతుల వరకూ వెళ్తోందట. బాలీవుడ్ హీరోల బాగోతంపై టాప్ హీరోయిన్ కత్రినా ఖైఫ్ చేసిన కామెంట్లు ఇవి. కొన్నాళ్ళుగా ఓర్చుకుంటున్న భావాలను ఒక్కసారిగా మీడియా ముందు బయటపెట్టింది. షూటింగుల సమయంలో తాను పడుతున్న బాధలను.., సెట్ లో ఉంటే కలిగే ఇబ్బందులను వివరించింది. తెరపై అందంగా కన్పించే హీరోలు, తెరవెనక ఎలా ఉంటారో రెండు మాటల్లో చెప్పేసింది. దీంతో అమ్మడితో నటించిన స్టార్ బాబులంతా ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారు.

సినిమా హీరోలు అంటే గ్లామర్, స్టైల్ మెయింటనెన్స్, గంటకో డ్రస్, రోజుకో షూ అని ఫ్యాన్స్ ఏదేదో ఊహించుకుంటారు. ఇదంతా బొమ్మకు ఒకవైపే కానీ మరోవైపును కత్రినా వివరించింది. స్నానం చేయని.., కనీసం బ్రష్ కూడా చేయని స్టార్లను తాను దగ్గరుండి చూశానని బాధలు వెళ్ళగక్కింది. ఓ కార్యక్రమంకు హాజరైన ఈ పొడుగు కాళ్ళ సుందరిని.., ‘బాలీవుడ్ లో ఎవరి పక్కన నటిస్తే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అంతే ఒక్కసారిగా కస్సున లేచింది. ‘కంఫర్ట్ సంగతి దేవుడెరుగు బాబు, కొందరు హీరోలు నరకం చూపించారు’ అని కామెంట్ చేసింది.

ఎందుకిలా.., అసలేమయింది అని ప్రశ్నించగా అసలు విషయం బయట పెట్టింది. ‘షూటింగ్ కు వచ్చేటపుడు కనీసం స్నానం చేసి రావాలనే సెన్స్ లేని స్టార్లు బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ఇక రాత్రిళ్ళు తాగి.., పొద్దున్నే పాచి మొహంతో సెట్స్ కు వచ్చే వారు కూడా ఉన్నారు. అలాంటి హీరోలతో నటిస్తుంటే నరకం కన్పించేంది. ఇదంతా ఒక ఎత్తయితే వారితో రొమాంటిక్ సీన్లలో నటించాల్సివచ్చినపుడు చెమట కంపు, నోట్లో నుంచి వచ్చే మందు వాసనతో వాంతి వచ్చినట్లుగా ఉండేది, అయినా సరే ఓర్చుకుని నటించాను’. అని చెప్పింది. అయితే ఎవరా డర్టీ బాయ్స్ అని అడగవద్దు, పేర్లు మాత్రం చెప్పను అని తెలిపింది.
 
ఇదే సమయంలో సౌత్ హీరోలపై సాఫ్ట్ కార్నర్ చూపించారు. సెట్ లో ఎలా ఉంటారో ఎంత చెప్పినా తక్కువే. నటనను వారు ఎంత ప్రేమిస్తారో.., నీట్ గా ఉండటాన్ని అంతగా కోరుకుంటారు. నీట్ గా సెట్స్ కు వస్తారు. పక్క వారు ఇబ్బంది పడేలా ప్రవర్తించరు. ఈ విషయంలో సౌత్ హీరోలను చూసి బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని కత్రినా చెప్పింది. ఈ అమ్మడు తెలుగులో వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’, బాలయ్యతో జంటగా ‘అల్లరి పిడుగు’లో నటించింది. అంటే వీరిద్దరూ ఉత్తమ స్టార్లు అని పరోక్షంగా చెప్పేసినట్లే. ఇప్పటికైనా ఆ మందుబాబులు.., బద్దకవీరులు ఎవరో కాస్త మేలుకుని అమ్మడు చెప్పిన మాటలతో అయినా బుద్ది తెచ్చుకుని మొహం కడుక్కని, స్నానం చేసి సెట్స్ కు వెళ్తే బాగుటుంది. లేకపోతే మరో ప్రెస్ మీట్ లో పేర్లు చెప్పి పరువు పోయేలా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : katrina kaif  bollywood heros  movies  heros behaviour  

Other Articles

Today on Telugu Wishesh