Kalyan ram pataas audio release date

pataas movie audio release date, pataas movie audio songs, pataas movie latest posters teaser, pataas movie kalyan ram wallpapers, pataas movie trailer, pataas movie release date, kalyan ram next movie updates, pataas movie cast and crew, nandamuri janakiram road accident, tollywood latest news updates

kalyan ram pataas audio release date : nandamuri kalyan ram pataas movie set to release audio on the occassion of new year celebrations. kalyan ram ready to air pataas movie songs as the new year gift to his fans

బాధలో ఉన్నా ఫ్యాన్స్ కు కానుక ఇస్తున్నాడు

Posted: 12/23/2014 03:40 PM IST
Kalyan ram pataas audio release date

అన్నయ్యను పోగొట్టుకున్న బాధలో నందమూరి కళ్యాణ్ రామ్ ఉన్నాడు. ఈ మద్య నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకీరామ్ చనిపోయిన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ మూవీ ఆడియో విడుదల(డిసెంబర్7)కు ఒకరోజు ముందుగా ఈ ఘటన జరగటంతో ఆడియో రిలీజ్ కార్యక్రమం అప్పట్లో వాయిదా పడింది. ప్రస్తుతం అన్నయ్య లేని బాధ నుంచి కళ్యాణ్ సహా ఆయన కుటుంబం ఇంకా కోలుకోలేదు. అయితే ఈ ప్రభావం తన సినిమాపై పడి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టవద్దని కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు.

జానకీరామ్ మృతి కారణంగా వాయిదా పడిన ఆడియో విడుదలను జనవరి 1న నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సర కానుకగా జనవరి 1, 2015న ‘పటాస్’ ఆడియోను ఫ్యాన్స్ కు అందిస్తామని మూవీ యూనిట్ వర్గాలు తెలిపాయి. బాధలో ఉన్నా, తప్పదు కాబట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నామని యూనిట్ సభ్యులు చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ పాల్గొంటున్నాడని తెలుస్తోంది. బాలకృష్ణ కూడా వస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నా అధికారిక సమాచారం మాత్రం లేదు.

శృతి సోది హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ నిర్మాతగా సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెరకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వం అందించిన ఈ మూవీకి సాయి కార్తిక్ సంగీతం అందించాడు. నందమూరి హీరో ఇందులో పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడు. ‘టెంపర్’ సినిమాలో కూడా ఎన్టీఆర్ పోలిస్ క్యారెక్టర్ లో నటించటంతో ఇద్దరు నందమూరి అన్నదమ్ముల మద్య పోటి ఉంటుంది అనుకున్నారు కానీ.., కొన్ని కారణాలతో ఆ సినిమా విడుదల కాలేదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pataas movie  kalyan ram latest  nandamuri janakiram  

Other Articles