Tollywood must learn from govindudu andarivadele

govindudu anadarivadele review, govindudu anadarivadele movie review, govindudu anadarivadele latest, govindudu govindudu anadarivadele rating, govindudu anadarivadele movie, govindudu anadarivadele records, govindudu anadarivadele photos, govindudu anadarivadele ram charan stills, ram charan tej, ram charan tej latest, ram charan upcoming movies, kajal, kajal agarwal, kajal agarwal hot, krishnavamshi, cast and crew, tollywood, movie news, tollywood, evergreen telugu movies

tollywood movie makers heros and producers must learn a lesson from govindudu andarivadele movie talk : govindudu andarivadele proved that people encourage family stories not much interested in love stories

గోవిందుడిని చూసి అందరూ నేర్చుకోండి

Posted: 10/01/2014 01:14 PM IST
Tollywood must learn from govindudu andarivadele

టాలీవుడ్ సినిమాలు చూసి..., చూసి అలిసి, అసంతృప్తిగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా మర్చిపోలేని క్షణాలను మిగులుస్తోంది. ఈ సినిమా చూశాము అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా ‘గోవిందుడు అందరివాడేలే’ ఉంది. ప్రతి ఒక్కరూ అంత అద్భుతంగా నటించారు. ఇందులో కధ, కధనం, పాటలు, మాటలు, సీన్లు, ఒకటేమిటి ప్రతి ఒక్కటి హైలైట్ అని చెప్పాలి. వాసనగొడుతున్న లవ్ కధలు, చూడలేకపోతున్న యాక్షన్ సినిమాలను భరిస్తున్న తెలుగు ప్రేక్షకులు సినిమా అంటే ఇది, అనేలా ఉంది ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ను మీకోసం అందిస్తున్నాం. దీన్ని చూసి అయినా టాలీవుడ్ ప్రముఖులు మేల్కుంటే మంచిదని చిన్న ప్రయత్నం.

ఈ కధలు వద్దు.. ప్లీజ్ !

తెలుగులో ఈ మద్య కుటుంబ కధా చిత్రాలు వచ్చిన దాఖలాలు లేవు. పోనీ కుటుంబం అంతా కలిసి చూసేలా ఉన్న సినిమాలు కూడా లేవు. ఓ ప్రేమకథను పట్టుకుని దానికి రెండు ఫైట్ సీన్లు, ఓ నెగెటివ్ రోల్, అక్కడక్కడా పాత్రలు.., అదనంగా ఎక్స్ పోజింగ్. ఇదే ఇప్పుడు తెలుగు సినిమాలో ఇఫ్పుడున్న ట్రెండ్. ఇక కామెడి విషయానికి వస్తే.., భరించలేని, నలుగురిలో చెప్పుకోలేని మాటలను కామెడిగా వాడేసి ఒక్కరే లేదా ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూసేలా తీస్తున్నారు. ఈ సినిమాలను ఇంటిల్లిపాది కలిసి ఒకచోట కూర్చుని చూడలేరు. అందుకే దాదాపు అన్నింటికి అన్నిటికి ‘ఎ’ సర్టిఫికెట్ వస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే కొందరు ‘ఎ’ సర్టిఫికెట్ కావాలని తహతహలాడుతుంటారు కూడా. ఇది వస్తే యూత్ ఎక్కువగా వచ్చి కలెక్షన్లు పెరుగుతాయని వారి ఆశ. వీరిని ఏమనాలో తెలియదు కానీ.  

ఇలాంటి సినిమాలు చూసి విసుగెత్తిన తెలుగు ప్రేక్షకుల కోసమే వచ్చింది అన్నట్లుగా ఉంది ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా. ఒక చక్కటి కధతో.., కుటుంబ నేపథ్యంగా సాగిపోయే సినిమాను అద్బుతంగా కృష్ణవంశీ తెరకెక్కించాడు. ఇక ఇందులోని నటులు కూడా పాత్రలకు తమవంతు న్యాయం చేశారు. రొమాన్స్, ఎక్స్ పోజింగ్ కోసం ఆరాట పడకుండా.., ప్రేక్షకులకు ఏదో మంచిని చెప్పాలి.., కుటుంబం విలువ భవిష్యత్ తరాలకు చాటాలి అనే సదుద్దేశ్యంతో మూవీ తీశారు. ప్రేక్షకులు ఏం కోరుకుంటారో.., అవే సినిమాలో చూపించటం జరిగింది. నిత్యం మన కుటుంబాల్లో జరిగే ఘటనలే ఇక్కడ సన్నివేశాలు అయ్యాయి తప్ప.. లేచిపోవటం.., మనుషుల్ని లేపేయటం అనేది చూపించలేదు.

ప్రపంచంలో ప్రేమించటమే గొప్ప పని అయినట్లుగా.., అది తప్ప మరో అంశమే లేదు అన్నట్లుగా మన టాలీవుడ్ ప్రముఖులు సినిమాలు తీస్తున్నారు. రొమాన్స్, ఎక్స్ పోజింగ్ విషయంలో బాలీవుడ్, మాలీవుడ్ ను చూసి ఎంతో ఇన్ స్పైర్ అవుతున్నారు. కాని అక్కడ వచ్చిన సందేశాత్మక, కుటుంబ కధా సినిమాలు ఇక్కడ రావటం లేదు. దీంట్లో మాత్రం బాలీవుడ్ ను ఆదర్శంగా తీసుకోవటం లేదు. ఎందుకని ప్రశ్నిస్తే..., ఈ రోజుల్లో ఇవన్ని ఎవరు చూస్తారు అని సమాధానం చెప్తారు. వీరికి ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాయే సమాధానం. ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ తక్కువే, రొమాన్స్ తక్కువే.., ప్రేమకధలు, భారీ యాక్షన్ ఫైట్లు కూడా ఎక్కువగా లేవు. అయినా సరే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేందుకు థియేటర్లకు బయల్దేరుతున్నారు.

ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు సినిమాలు చూసి ఉద్యమించిన ప్రజలు.. ఇప్పుడు సినిమాలపైనే ఎందుకు ఉద్యమిస్తున్నారో తెలుసుకోండి. భారీ బడ్జెట్ సినిమాలు.., బట్టలు కరువయ్యే సీన్ల కంటే మంచి కధ, కుటుంబనేపథ్యం, సమాజానికి మంచి చెప్పాలనే సదుద్దేశంతో సినిమా తీస్తే.., ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. ఇది ‘గోవిందుడు అందరివాడేలే’తో మరోసారి నిరూపితమైంది. రికార్డుల రేసులో పడి.., సమాజానికి చెడు చేయకండి అని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. ఆవైపుగా అంతా ఆలోచిస్తారని ఆశిస్తున్నాం.

Click Her for : Govindadu Andarivadele Movie Review

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : govindudu andarivadele  latest news  tollywood  movies  

Other Articles