Allu arjun new movie update

allu arjun, allu arjun wiki, allu arjun photos, allu arjun latest, allu arjun news, allu arjun latest updates, allu arjun upcoming movies, allu arjun son, allu arjun marriage, allu arjun caste, allu arjun fans, megastar, mega fans, tollywood, trivikram srinivas, trivikram srinivas wiki, trivikram srinivas movies, trivikram srinivas family, kannada super star upendra, upendra wiki, upendra latest, upendra, adah sharma, sneha, adah sharma hot, adah sharma latest hot photos, sneha latest hot photos, sneha marriage

stylish star allu arjun new movie shooting in progress now the team in ooty to shoot songs : trivikram srinivas with allu arjun and movie team went to ooty for songs shooting

ఊటి టికెట్ బుక్ చేసుకున్న ‘జులాయి’

Posted: 10/01/2014 02:59 PM IST
Allu arjun new movie update

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అదాశర్మతో కలిసి ఊటికి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకన్నాడట. అక్కడ ఇద్దరూ కలిసి తెగ డాన్సులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అర్జున్ భార్య ప్రస్తుతం లగేజి సర్దే పనిలో ఉన్నట్లు మెగా ఫ్యామిలి వర్గాలు అంటున్నాయి. అసలు విషయానికి వస్తే.., జులాయి హిట్ కాంబినేషన్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్య ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది కూడా. పాటల లొకేషన్ల కోసం ఊటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం నవరాత్రులు ఉండటంతో.., దసరా పండగ తర్వాత ఊటికి వెళ్ళాలని షెడ్యూల్ ఖరారు చేశారు.

పాటలతో పాటు సినిమాలోని పలు కీలక సీన్లను కూడా అక్కడ షూట్ చేస్తారని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, ఫ్యామిలి హీరోయిన్ స్నేహ కూడా ఊటికి వస్తారని తెలుస్తోంది. వీరిందరి నేపథ్యంగా అక్కడ మాటల మాంత్రికుడు పలు సీన్లు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కన్నడలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఈ సినిమాలో నటిస్తుండటంతో.., ఆయన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పాత్రను కేటాయించారని టాక్ విన్పిస్తోంది.

హీరోతో సమానం అయిన పాజిటివ్ రోల్ లో ఉపేంద్ర నటిస్తారని ఈ సినిమా వర్గాలు అంటున్నాయి. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘జులాయి’ సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్న రాధాకృష్ణ ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘జులాయి’ సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్, అర్జున్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  trivikram srinivas  adah sharma  upendra  sneha  

Other Articles