Samantha charges 10 lakhs for 2 minutes

Samantha Charges 10 Lakhs For 2 Min, Samantha Charges 10 Lakhs, samantha remuneration 2 lakhs, samantha remuneration, samantha remuneration news, samantha remuneration details, samantha, remuneration

Samantha is the leading actress in Tollywood. She charges more than 2 cr as her remuneration...

డబ్బు వ్యామోహంలో పిచ్చిదైన సమంత!

Posted: 08/14/2014 11:27 AM IST
Samantha charges 10 lakhs for 2 minutes

(Image source from: Samantha Charges 10 Lakhs For 2 Minutes )

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకుపోతున్న గ్లామర్ డాల్ సమంత.. డబ్బుకు దాసోహమయినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటివరకు కేవలం మంచి పాత్ర వున్న సినిమాలనే ఒప్పుకుంటానని హితువులు పలికిన సమంత.. ఇప్పుడు డబ్బు వ్యామోహంలో పడి తన శరీరంగాలను రచ్చరచ్చగా చూపించేస్తోంది. ఇంతగా ఎక్స్ పోజింగ్ ఎందుకు చేశారు అని అడిగితే.. పోటీ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఆమె కవరింగ్ ఇచ్చుకుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం డబ్బులు బాగా దండుకోవడం వల్ల అలా విచ్చలవిడిగా చూపించేసిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వస్తున్న ‘‘అంజాన్’’ సినిమాలో కూడా ఈ అమ్మడు అందాల ఆరబోతకు బాగానే డబ్బులు గుంజేసిందని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో అందాల భామ సమంతకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువయిపోయిందని ఎక్కడచూసినా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కేవలం సినిమాలవరకే కాదు బాబు... ఏ ఫంక్షన్ కి అయినా, ఏ ఫ్యాషన్ షోకి వెళ్లినా, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసినా ఈ అమ్మడు ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకంగా భారీగా పారితోషం తీసుకుంటోందని విశ్లేషకులు వాపోతున్నారు. స్టార్ ఇమేజ్ వుంది కదా అని ఇష్టమొచ్చినట్లు రేట్లు ఫిక్స్ చేసి, నిర్మాతలకు - నిర్వాహకులకు దిమ్మతిరిగిపోయేలా చేస్తోందని అంటున్నారు. దీంతో ‘‘దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’’ అనే ఫార్ములా ప్రకారం.. గ్లామర్ వున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే విషయాన్ని సమంత బాగానే అర్థం చేసుకుందని.. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా డబ్బులు పొగేసుకుంటోందని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు సినిమాలతోపాటు యాడ్స్ లలో కూడా రోజురోజుకు రెమ్యునరేషన్ ను పెంచేసుకుంటూ నిర్మాతలకు పట్టపగలే మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా చుక్కలు చూపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నారు.

ఇదిలావుండగా.. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఓ ష్యాషన్ షోలో గ్లామర్ డాల్ సమంత పాల్గొంది. ఆ షోలో ఈ భామ చీర కట్టి... స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేస్తూ... తన వయ్యరాలు ఒలకబోస్తూ... తెగ మురిసిపోయింది. అయితే ఇక్కడ కూడా సమంత తన డబ్బు బుద్ధిని మానుకోలేదని సదరు నిర్వాహకులు వాపోతున్నారు. ఈ షోకి విచ్చేసిన అనంతరం సమంత ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క విధంగా రేటు ఫిక్స్ చేసిందని వారు తెలుపుతున్నారు. ముందుగా షోకు హాజరు కావడానికి డబ్బులు తీసుకున్న సమంత.. పనిలో పనిగా సదరు సంస్థ నిర్వాహాకులు ర్యాంప్ వాక్ చేయమని ఆమెను కోరడంతో మరో 10 లక్షల రూపాయలు అదనంగా వసూలు చేసిందని. అంటే కేవలం రెండు నిముషాల ర్యాంప్ వాక్ కోసం ఈ అమ్మడు ఏకంగా పది లక్షలు నొక్కేసిందని పేర్కొంటున్నారు. ఇంతదూరమొచ్చాక సిగ్గేందుకు అన్నట్లు.. ఆ సంస్థ నిర్వాహకులు ఆమెతో ర్యాంప్ వాక్ చేయిస్తే... దొరికిందే అదునుగా భావించి సమంత పదిలక్షలు కొట్టేసింది. దీంతో సమంతకు రానురాను డబ్బుల పిచ్చి మరీ ఎక్కువయిపోతోందని అందరూ వ్యాఖ్యానాలు గుప్పిస్తారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles