Nani janda pai kapiraju release this month

nani janda pai kapiraju release this month, nani jenda pai kapiraju movie, hero nani jenda pai kapiraju movie

Nani janda pai kapiraju release this month

జెండాపై కపిరాజుతో నాని జాతకం మారేనా ?

Posted: 07/04/2014 06:50 PM IST
Nani janda pai kapiraju release this month

సినిమా ఇండస్ట్రీలోకి అతివేగంగా దూసుకొచ్చిన యువ హీరోల్లో నాని ఒకరు. ఆయన ఫిజిక్, నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోవడంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిపోవడం ఖాయం అని అనుకున్నారంతా. వారు అనుకున్నట్లుగానే వరుస అవకాశాలు కూడా వరించాయి.

ఈగ సినిమా తరువాత బిజీ అయిన నాని మూడు ప్రాజెక్టులు చేశాడు. ఆయన అదృష్టమో, దురదృష్టమో కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించిన మూడు సినిమాలు వివిధ కారణాలతో వాయిదాలు పడుతూ పైసా, ఆహా క‌ల్యాణం, జెండా పైక‌పిరాజు ఒకే నెలలో విడుదలకు సిద్దం చేశారు. ఏ స్టార్ హీరోల సినిమాలు లేవు కాబట్టి తన సినిమాలు బాగా ఆడుతాయని చంకలు గుద్దుకున్నాడు. నాని. పైసా, ఆహా క‌ల్యాణం సినిమాలు వారం వ్యవధిలో విడుదల అయ్యి, బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.

 దీంతో మూడో సినిమా అయిన జెండా పైక‌పిరాజు సినిమాని విడుద‌ల చేయ‌డానికి సాహ‌సించ‌లేక‌పోయారు నిర్మాత‌లు. ఆ త‌ర్వాత ఒక‌ట్రెండు సార్లు రిలీజ్ డేట్ ప్రక‌టించి ఆ త‌ర‌వాత తూచ్ చెప్పారు. దీనికి ఆర్థిక పరిస్థితులే కారణం అని వార్తలు వచ్చాయి. ఇన్నాళ్ళు ల్యాబ్ లో మూలుగుతూ దుమ్ము పట్టినా జెండాను దుమ్ము దులిపి ఎలాగైనా ఈనెల చివరి వారంలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

గత సినిమాల పరాజయం తరువాత కెరియర్ డైలామాలో పడ్డ నాని ఈ సినిమా విడుదల చేయమని, కావాలంటే తనవంతు సాయం కూడా చేస్తానని నిర్మాతల్ని వేడుకుంటున్నాడట. మరి ఈసారైనా ఈ సినిమా వచ్చి, నాని జాతకం మార్చి పూర్వవైభవం తీసుకొస్తుందో లేదో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles