Manchu manoj injured current teega shooting

Manchu manoj injured, current teega movie shooting, Hero Manchu manoj, Manchu manoj injured, current teega movie shooting, nageswearareddy direction

Manchu manoj injured current teega shooting.

మంటల్లో మంచు మనోజ్... గాయాలు

Posted: 07/04/2014 07:39 PM IST
Manchu manoj injured current teega shooting

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కి కాలం అస్సలు కలిసి రావడంలేదు. ఆయనకు ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న చిత్రాల చిత్రీకరణ సమయంలో గాయపడుతూ ఉన్నాడు. గతంలో  మిస్టర్ నూకయ్య’, ‘పోటుగాడు’ సినిమా షూటింగ్ సమయంలోనూ గాయాల పాలయ్యాడు.

అదీ కాకుండా ఓసారి ఔటర్ రింగ్ లో కారు ప్రమాదంలో భారీ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఇప్పుడు తాజాగా నటిస్తున్న ‘కరెంట్ తీగ’ షూటింగ్ లో గాయపడ్డానని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియ జేశాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ మరియు పైట్ సీన్స్ మంటల్లో చిత్రీకరిస్తుండగా మనోజ్ కు మంటలు అంటుకోవడంతో గాయపడ్డాడని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా అందిన సమాచారం. 

ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందన్న సమాచారం మాత్రం తెలియరాలేదు. ఏమైనా మనోజ్ కే ఇలా ప్రతిసారి ఏదో ఒకటి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles