Balayya legend 100 days function at hindupur

balayya legend 100 days function at hindupur, legend 100 days function, hindupur, nandamuri balakrishna, boyapati srinu garu , 14 reels entertainment

balayya legend 100 days function at hindupur

తన ఇలాకాలో పండగ చేసుకుంటున్న బాలయ్య

Posted: 07/03/2014 01:24 PM IST
Balayya legend 100 days function at hindupur

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపూర్ నుండి పోటీ చేసి, ఘన విజయం సాధించిన బాలయ్య హిందూపూర్ ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని మాటిచ్చాడు. అభివృద్ది మాట అటుంచితే... తనను గెలిపించిన ఆ నియోజక వర్గ ప్రజలను మాంచి ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

బోయపాటి శీను దర్శకత్వంలో ఈయన చేసిన ‘లెజెండ్ ’ సినిమా ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఈనెల 5వ తేదీతో 100 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంలో వందరోజుల పండుగను బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపూర్ పట్టణంలో నిర్వహించి  వారిని ఎంటర్ టైన్ చేయనున్నాడు. నేటి సాయంత్రం అనగా (గురువారం జులై 3) వ తేదీన అక్కడి గురునాథ ధియేటర్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.. బాలకృష్ణ తన తదుపరి చిత్రం షూటింగులో బిజీ కాబోతున్నందును రెండు రోజుల ముందుగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారట.

అభిమానుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో బాలయ్య, బోయపాటి, నిర్మాతలు తదితరులు పాల్గొంటారు. హిందూపూర్ ని అది చేస్తాను... ఇది చేస్తాను అని చెప్పిన బాలయ్య ఇలా సినిమాల షెడ్యూల్లో బిజీగా ఉంటే నియోజక వర్గ అభివృద్ది పరిస్టితి ఏంటని ప్రశ్నిస్తున్నారు అక్కడి ప్రజలు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles