Actress shanvi entry in to tamil industry

shanvi signs tamil movie, shanvi signs first tamil debut, actress shanvi entry in to tamil induestry, shanvi get kollywood chance,ashok selvan,villa fame ashok selvan,a.r.murugados,asraf

Actress Shanvi Entry in to Tamil industry, shanvi signs first tamil debut, actress shanvi entry in to tamil induestry, shanvi get kollywood.

‘లవ్ లీ పోరీ అక్కడ మొదలు పెట్టింది...

Posted: 07/03/2014 11:45 AM IST
Actress shanvi entry in to tamil industry

సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఏలేద్దాం... అందర్ని తన కొంగున కట్టేసుకుందాం అని ఎంట్రీ ఇచ్చిన భామలు చాలా మందే ఉన్నారు. కానీ కొంత మందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అందం, అభినయం, అందాలు ఆరబోసినా, సినిమాలు హిట్టయినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తుంటాయి. దీంతో వచ్చిన ఏ చిన్న అవకాశాన్నైనా వదులుకోవడానికి ఇష్టపడరు చాలా మంది కథానాయికలు. ఇప్పుడు అదే సూత్రాన్ని ఫాలో అవుతుంది ‘లవ్ లీ ’ పోరీ శాన్వి.

తాను నటించిన తొలి సినిమా ‘లవ్ లీ ’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకొని అడ్డా, రౌడీ లాంటి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న ఈ అమ్మడు అందాలు ఏ మాత్రం దాచుకోకుండా ఆరబోసింది. అయినా తెలుగులో అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీకి తన అడ్డాను మార్చేసింది. తాజాగా ఈ అమ్మడుకు తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆష్రాష్ దర్శకత్వంలో రూపొందబోయే  సినిమాలో విల్లా, భద్రమ్ ఫేం అశోక్ సెల్వన్ తో కలిసి జత కట్టబోతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి వెళ్లిన భామలు కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్నారు. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు తన అందాల రుచిని చూపించిన శాన్వి అందాలకు తమిళ తంబీలు ఫిదా అవుతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles