Young flop in bangalore days remake

naga chaitanya , siddharth, nani, samantha, bangalore days telugu remake, malayalam blockbuster movie, dil raju, pvp productions, bommarillu bhashkar

Young flop in Bangalore Days remake

దిల్ రాజుకు ఈ ప్లాప్ హీరోలే దొరికారా ?

Posted: 07/03/2014 01:47 PM IST
Young flop in bangalore days remake

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు నిర్మించిన  సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక కాస్తంత కష్టాల్లో పడ్డట్లు టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. అందుకే ఆయన సినిమాలను నిర్మించడం మానేసి డిస్ట్రిబ్యూటర్ గా ఎక్కువ సినిమాల హక్కుల్ని దక్కించుకుంటున్నాడు. అదే టైంలో చిన్న చిన్న సినిమాల పై కూడా దృష్టి సారించాడు. అందులో భాగంగాలనే ‘బెంగుళూరు డేస్ ’ సినిమా తెలుగు రైట్స్ ని తీసుకొని దానిని పీవీపీ సంస్థతో కలిసి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు అవసరం కాగా, ఇప్పటికే నాగచైతన్యను తీసుకుందామని అనుకున్నాడు.

ఇప్పుడు మరో ఇద్దరు హీరోలుగా నానిని, సిద్దార్థను కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ముగ్గురు యంగ్ హీరోలను తీసుకోవడం వరకు బాగానే ఉన్నా, వీరి ముగ్గురి హిట్ల  గ్రాఫ్ గత కొంత కాలంగా మరీ దారుణంగా ఉంది. చైతన్య నటించిన తఢాక, ఆటోనగర్ సూర్య చిత్రాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేక పోయాయి. నానికి ‘ఈగ’ తరువాత వచ్చిన సినిమాలన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. మరో చిత్రం విడుదల ఎప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది. సిద్దార్థ్ చిత్రాలు డిజాస్టర్ అయ్యి ఖాళీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పెట్టి దిల్ రాజు సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా ? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. అసలే నిర్మాతగా ఈ మధ్య కాలంలో రాణించలేకపోతున్న దిల్ రాజు వీరిని పెట్టుకోవడం కాస్తంత ఇబ్బందికరమే అంటున్నారు.

కాగా సమంతా ఈ సినిమా తెలుగులో వస్తుంది అన్నప్పటి నుండే ఆసక్తిగా ఉండడంతో పాటు ఇది మరో క్రేజీ మల్టీస్టారర్ అని కూడా చెబుతూ వస్తుంది. మరి సమంతా ఈ సినిమాలో ఎవరికి జోడి అవుతుందోనని ఇంటరెస్ట్ గా మారింది. ఇప్పటికే చైతూతో మూడు సినిమాలకు.. నానీతో రెండు సినిమాలలో నటించిన సమంతా ఈ సినిమాలో నటిస్తే చైతూకి జోడినా? లేక నానీకి జోడినా? అన్నది చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles