I am not sharing personal matters nithya menon

actress nitya menon, love and marriage issues, nitya menon marrige issues

i am not sharing personal matters: nithya menon

నిత్యామీనన్ తో జర జాగ్రత్త ..

Posted: 07/03/2014 09:46 AM IST
I am not sharing personal matters nithya menon

నిత్యామీనన్... చూడటానికి పొట్టిగా బొద్దుగా క్యూట్ గా ఉంటుంది కదా అని ఆమెను కదిలిస్తే అందరిలాగా సాఫ్ట్ గా సమాధానాలు చెప్పదు. కథానాయికల్ని మీడియా వారు కనపడినప్పుడల్లా ఏదో ఒక విషయం పై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. చాలా సందర్భాల్లో ప్రేమ, పెళ్లి విషయాల గురించే అడుగుతుంటారు. కొంత మంది వాటికి తీరిగ్గా సమాధానాలు చెబితే, మరి కొంతమంది కాస్తంత కటువుగా అంటే మరోసారి అలాంటి విషయాలు అడగకుండా సమాధానం చెబుతారు.

రెండో కోవకే చెందుతుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న బబ్లీ గాళ్ నిత్యామీనన్ పెళ్లెప్పుడు అడిగితే అంతెత్తు లేచి ఫైర్ అవుతోంది. ప్రేమ, పెళ్లి వంటి విషయాలు నా వ్యక్తిగతం. అవి నా మనసుకు సంబంధించినవి. వాటిని బహిరంగంగా మరొకరితో పంచుకోవడం నాకు ఇష్టం వుండదు. అందుకే , ఎవరైనా ఇలాంటి పర్శనల్ విషయాలు అడిగితే నాకు కోపం వస్తుంది. నా నటన గురించో, సినిమాల గురించో అడిగితే వివరంగా చెబుతాను అని కాస్తంత కోపంగానే చెప్పుకొచ్చింది.

కొంత మంది నటీమణులు నిత్యం వార్తల్లో ఉంటే అవకాశాలు వస్తాయని అనుకుంటారు. కానీ నిత్యా అలా కాదు తన నటనతో, వాక్ చాతుర్యంతో ఆకట్టుకుంటూ ఓ మెచ్యూర్డ్ నటిగా తన ప్రొఫెషలిజాన్ని చాటుకుంటూ పలువురు నటులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇటీవలి కాలంలో చాలా మంది నటీమణులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో మరి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles