Ntr rabasa movie business over

NTR rabasa movie business over, ntr rabasa movie business, Rabhasa Movie Pre Release Business, Rabhasa Area Wise business

NTR rabasa movie business over, ntr rabasa movie business, Rabhasa Movie Pre Release Business, Rabhasa Area Wise business

విడుదలకు ముందే బిజినెస్ లో రచ్చ

Posted: 07/02/2014 08:02 PM IST
Ntr rabasa movie business over

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలసిందే. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ కి గత కొన్ని సినిమాల నుండి సరైన హిట్టు పడటం లేదు. అయినా ఆయన క్రేజ్, ఇమేజ్ ఫ్యాన్స్ లో ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు సినిమా రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. కానీ గత సినిమాల గ్రాఫ్ ని బట్టి, ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘రభస ’ కు ఏ మాత్రం మార్కెట్ ఉంటుందో అని అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కనీసం ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఈ సినిమా అన్ని ఏరియాల బిజినెస్ అయిపోయి, టేబుల్ ప్రాఫిట్ కింద 5 కోట్ల మేర వచ్చాయని అంటున్నారు. శాటిలైట్ హ‌క్కుల కోసం జెమిని క‌ర్చీఫ్ వేసేసింది. సినిమాకు లాభాలు ఎంతస్తాయనేది ప్రక్కన పెడితే బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టిన నిర్మాతకు ఎటువంటి నష్టం ఉండదు. మరి ఈ సినిమాకు ఇంత క్రేజ్, రేటు రావడానికి ఎన్టీఆర్ స్టార్‌డ‌మ్, ఇమేజ్ క‌లిసొచ్చాయని  చెప్పవచ్చు.

రామ‌య్యా వ‌స్తావ‌య్యా డిజాస్టర్ అయినా స‌రే... ర‌భ‌స‌కు ఈ రేంజ్‌లో ఫ్యాన్సీ ఆఫ‌ర్లు రావ‌డం.. ఎన్టీఆర్ స్టామినాకు నిద‌ర్శనం !మొత్తానికి చాలా కాలం నుంచి హిట్లు లేని ఎన్టీఆర్ కి, నిర్మాతగా గత కొన్ని రోజుల నుండి చితికిల పడిన బెల్లంకొండకు కూడా ఈ సినిమా కలసిసొచ్చే సూచనలు ఉన్నాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles