Mahesh babu guest role in sudheer babu movie

Mahesh Babu guest role in Sudheer Babu movie, rishnamma Kalipindi Iddarini news,Mahesh Babu guest role for Brother-in-law, Superstar Mahesh Babu

Mahesh Babu guest role in Sudheer Babu movie, rishnamma Kalipindi Iddarini news,Mahesh Babu guest role for Brother-in-law, Superstar Mahesh Babu

బావ కోసం పాట్లు పడుతున్న మహేశ్

Posted: 07/02/2014 08:23 PM IST
Mahesh babu guest role in sudheer babu movie

ప్రిన్స్ మహేష్ బాబు తన వారి కోసం ఎదైనా చేయడానికి ముందుంటాడని అర్థం అవుతుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో  బావ గల్లా జయదేవ్ కి సపోర్ట్ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరో బావ సుధీర్ బాబు కోసం ఇప్పటి వరకు చేయని పని చేస్తున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా, ఏ సినిమాలో అతిథి పాత్ర చేయని ప్రిన్స్ ఆయన బావ సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ’ అనే సినిమాలో ప్రత్యేకపాత్రను పోషించబోతున్నాడట.

గతంలో ఇతర హీరోలు నటించిన ‘జల్సా ’, ‘బాద్ షా ’ చిత్రాల్లో వాయిస్ ఓవర్ కే పరిమితయ్యారు. గత కొంత కాలం క్రితం ‘రుద్రమదేవి ’ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను పోషిస్తాడని వార్తలు వచ్చినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. కన్నడంలో విజయం సాధించిన చార్మినార్ అనే చిత్రం రీమేక్ గా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ’ చిత్రం పేరుతో రూపుదిద్దుకుంటోంది.

సుధీర్ బాబు సరసన నందిత నటిస్తుంది. ఈ చిత్రంలో మహేశ్ కోసం ఓ ప్రత్యేక పాత్ర రూపొందించాం . మహేశ్ కు పాత్ర గురించి చెప్పగానే చేయడానికి ముందుకొచ్చారు. మా చిత్రంలో మహేశ్ కనిపించడానికి సుధీర్ ఎంతో కృషి చేశారని దర్శకుడు చంద్రు అన్నారు. ఆగడు షూటింగ్ పూర్తయిన వెంటనే మహేశ్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారన్నారు. ఈ చిత్రానికి మహేష్ ఏ మేరకు ప్లస్ అవుతాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles