సాధారణంగా అభిమానులు తమ అభిమాన తారలకు సంబంధించిన ప్రతిఒక్క విషయం గురించి ఓ కన్నేసి వుంచుతారు. వారి సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయి, రానున్న సినిమాలేంటి... ఒకవేళ సినిమాలు లేకపోతే ఎటువంటి ఫంక్షన్లకు హాజరవుతుంటారు... వంటివి విశేషాల గురించి గూపిలాగి మరీ వెతికి తెలుసుకుంటారు. దాదాపుగా వారి పర్సనల్ ఫ్యామిలీ విషయాలు తప్ప... మిగతా విశేషాలన్నీ ఏదో ఒక విధంగా సాధిస్తారు.
అయితే చాలామంది అభిమానులు తమ అభినయ తారల పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉర్రూతలూగుతుంటారు. ఏ తారలు కూడా తమ పర్సనల్ లైఫ్ గురించి సాధారణంగా బయటపెట్టుకోరు. ఎంతో నిగ్గదీసి అడిగితే మాత్రం... ఏందో అరకొర విశేషాలు చెప్పి, తప్పుకుంటారు. కొందరు మాత్రం ఎటువంటి బెడియం లేకుండానే తమ జీవితానుభవాలను నలుగురితో పంచుకుంటారు. అటువంటి స్టార్స్ లలో మెగా జంటగా పిలువబడే రామ్ చరణ్, ఉపాసనల పర్సనల్ జీవితాల గురించి ఒకసారి లుక్కేద్దాం...
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో టాలీవుడ్ తెరపై కనువిందు చేసిన అతికొద్దికాలంలోనే అతనొక యువసంచలనంగా పేరు సంపాదించుకున్నాడు. డ్యాన్సింగ్, యాక్టింగ్, ఫైట్స్, సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్ చేసి, టాలీవుడ్ లోనే తనదైన ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తండ్రిని మించిన కొడుగ్గా తెలుగు చిత్రసీమలోనే పేరుతెచ్చుకున్న ఆ యువహీరోనే ‘‘రామ్ చరణ్’’. ఈ మెగా హీరోకి సంబంధించిన రీల్ లైఫ్ లవ్ స్టోరీల గురించి ప్రతిఒక్కరికి తెలిసిందే!
అయితే ఇతని రియల్ లైఫ్ లవ్ స్టోరీ మాత్రం ఒక పెద్ద సీక్రెట్. అసలు రామ్ చరణ్, తన భార్య ఉపాసనను పెళ్లి కాకముందు ఎలా కలుసుకున్నాడు... వీరిద్దరికీ పరిచయం ఎలా కుదిరింది... ఎవరు ఎవర్ని ప్రపోజ్ చేసుకున్నారు... అనే విషయాల గురించి గతంలో చాలావార్తలే వచ్చాయి. అయితే ఇప్పుడు నేరుగా ఉపాసన మీడియా ముందుకొచ్చి, తన పర్సనల్ విశేషాల గురించి వివరిస్తూ... తమ లవ్ స్టోరీని కూడా రివీల్ చేశారు. ఆ విశేషాలేంటో ఒకసారి లుక్కేద్దాం...
ఉపాసన పర్సనల్ స్టోరీ : చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ తేజ్ కు ఏ విధంగా అయితే మంచి గుర్తింపు వుందో... అలాగే ఉసాసనకు కూడా సోషల్ సర్కిల్స్ లో గుర్తింపుంది. లండన్ లో ‘‘గ్లోబల్ బిజినెస్ మార్కెటింగ్ మేనేజ్ మెంట్’’ లో డిగ్రీ పూర్తి చేసిన ఉపాసన... ఆ తరువాత అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ లో పట్టా పుచ్చుకున్నారు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె... తన ఫ్యామిలీ నిర్వహిస్తున్న హెల్త్ కేర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం... వెంటనే ‘‘సేవ్ ఏ చైల్డ్ హార్ట్’’ (SACH) అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈమె ప్రదర్శించిన ఉత్సాహాన్ని చూసి.. ఆమె తాతయ్య, అపోలో హాస్పిటల్స్ సీఈఓ అయిన డా. ప్రతాప్ సి.రెడ్డి... 2008వ సంవత్సరంలో అపోలో ఫిలాంత్రఫీ విభాగానికి ఈమెను వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ హోదాలో వున్నప్పుడు సాధారణమైన క్లినిక్ లు కూడా లేని మారుమూల గ్రామాల్లో, పల్లెల్లో ఎన్నో హెల్త్ క్యాంపులను నిర్వహించింది. ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగించిన ఉసాసన.. సోషల్ మీడియాలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈ విజయాలన్నింటిని వెనుక తన పిన్ని సహాయం ఎంతో వుందంటోంది ఉపాసన. అలాగే తన పిన్ని సహాయంతోనే రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్నానని పేర్కొంటోందామె.
ఉపాసన్ - రామ్ చరణ్ లవ్ స్టోరీ : ఉపాసన్ - రామ్ చరణ్ లు పెళ్లి చేసుకోవడానికి ముందు చిన్ననాటి స్నేహితులు. ఉపాసన తమ ప్రేమ వ్యవహారాల గురించి వివరిస్తూ... ‘‘రామ్ చరణ్ నాకు పెళ్లికి ముందు మూడుసార్లు ప్రపోజ్ చేశాడు’’ అని చెర్రీ రహస్యాన్ని బయటపెట్టేసింది. మొదట చెర్రీ తనను ఇంట్లో తన అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ అందరి సమక్షంలోనే ఒకసారి ప్రపోజ్ చేశాడని... ఆ తరువాత పర్సనల్ గా కూడా ప్రపోజ్ చేశాడని చెప్పింది. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ క్షణాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని అంది. పెళ్లియిన తరువాత చెర్రీ తనకు ఎప్పటికీ సపోర్టివ్ గా వ్యవహిరిస్తాడని.. ప్రతి చిన్న విషయంలోనూ సహాయం చేస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే తన కుటుంబసభ్యులు కూడా తనకు ఎంతో సహకరిస్తారని తన కుటుంబ విశేషాల గురించి గుర్తు చేసుకుంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more