Varun tej gollabhama first look released

varun tej gollabhama first look released, varun tej latest news, varun tej gollabhama first look, varun teja latest movie, gollabhama movie first look, aaradugula bullet first look, varun tej starrer gollabhama first look

varun tej gollabhama first look released

గోలపెడుతున్న ‘‘గొల్లభామ’’ ఫస్ట్ లుక్

Posted: 06/24/2014 07:07 PM IST
Varun tej gollabhama first look released

(Image source from: varun tej gollabhama first look released)

మెగా ఫ్యామిలీ వారసుల సినిమాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలుపెట్టేశాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రేయ్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంటే.. తాజాగా నాగబాబు తనయుడు అయిన వరుణ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘‘గొల్లభామ’’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. యాక్షన్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

‘‘గొల్లభామ’’ ఫస్ట్ లుక్ ఫోటోని కనువిందు చేసిన ప్రతిఒక్కరు... వరుణ్ తేజ్ ను ప్రశంసల జల్లులో ముంచెత్తుతున్నారు. తనలో వున్న మాస్ యాంగిల్స్ ని చూపిస్తూ, చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడని అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా వరుణ్ గురించి ప్రశంసిస్తూ... జనాలను ఒక కొత్త యాక్షన్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, త్వరలోనే ఒక మంచి సినిమాను వీక్షిస్తారని పేర్కొన్నాడు.

మొదట ఈ సినిమాకు ‘‘ఆరడుగుల బుల్లెట్టు’’ అని టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వస్తే... మరోసారి ‘‘గొల్లభామ’’ అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే ఇంతవరకు ఈ రెండు టైటిళ్ల మీద ఎటువంటి క్లారిటీ రాలేదు. తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ ఫోటోను చూసిన అభిమానులు... ఆయన బాడీకి తగ్గట్టుగా ఆరడుగుల బుల్లెట్టు అనే టైటిల్ వుంటేనే బాగుంటుందని వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై స్పందించిన సదరు యూనిట్ సభ్యులు టైటిల్ పై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేస్తామని సమాధానం ఇచ్చారని చెబుతున్నారు.

మాస్ యాక్షన్ తో పాటు కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక గెస్ట్ రోల్ పాత్ర చేయనున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. ఇంకా దానిపై యూనిట్ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles