Hero surya target 150 crore club

Hero surya Target 150 crore club, Hero surya Anjaan movie, Anjaan movie Stills , Anjann movie First look, south india movie

Hero surya Target 150 crore club, Hero surya Anjaan movie, Anjaan movie Stills , Anjann movie First look, south india movie

150 కోట్ల పై గురి పెట్టాడు

Posted: 06/23/2014 05:34 PM IST
Hero surya target 150 crore club

హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని సినిమాలు ఎప్పుడో 100 కోట్ల మార్కును దాటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా వందకోట్ల మార్కుకు చేరువలో ఉంది. పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది ’ 100 కోట్ల క్లబ్బును దాటుతుందనుకుంటే 80 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. త్వరలో ఈ కోరిక తీర్చడానికి రెడీ అవుతున్నాయి రాజమౌళి ‘బాహుబలి ’, గుణశేఖర్ ‘రుద్రమ దేవి ’ సినిమాలు. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కడమే కాకుండా, భారీ గ్రాఫిక్స్ తో రాబోతున్నాయి కాబట్టి ఈ సినిమాలు వందకోట్ల కబ్బును తాకడం ఖాయం అనే అంచానాలు వేస్తున్నారు.

అయితే మార్కెట్ ను పెంచుకోవడంలో మన తెలుగు హీరోలు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంటే పొరుగున ఉన్న తమిళ తంబీలు మాత్రం నిచ్చెనతో ఆకాశానికి పందిర్లు వేసే పనిలో పడ్డారు. బాలీవుడ్ తర్వాత స్థానానికి తమిళ హీరోలు ఎసరు పెట్టేస్తున్నారు . ప్రస్తుతం సూర్యకు తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడలో కొద్ది మార్కెట్ ఉంది. అందుకే ఇక మిగిలిన హిందీ మీద కూడా కన్నేశాడు.

సూర్య త్వరలోనే లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న అంజాన్ సినిమాను తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు. హిందీలో విడుదల చేసి మరో యాభై కోట్లు కొల్లగొట్టాలనే ప్లాన్ లో ఉన్నాడట. గతంలో వర్మ రక్తచరిత్ర 2 తో హిందీలో కూడా అడుగుపెట్టిన సూర్య ఆ సినిమా ప్లాప్ తో కాస్త వెనక్కుతగ్గాడు. అయితే ఏది ఏమైనా అక్కడ పాగా వేయడానికి సిద్దమయ్యాడు.

అంజాన్ సినిమాతో సూర్య 150 కోట్ల క్లబ్ లో చేరాలని చూస్తున్నాడు. ఊర మాస్ మసాలా చిత్రంగా వస్తున్న ‘అంజాన్ ’ అనుకున్నట్లు 150 కోట్లు కొల్లగొడితే మాత్రం రికార్డే అవుతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles