It is not my son picture allu arjun tweet

Allu arjun, ALlu arjun son, allu arjun son photo revealed, he is not my son, ayaan photo leaked, allua rjun tweet on his on picture, Allu Arjun, Sneha Reddy, allu arjun father, Allu Arjun dad, allu arjun son ayaan, Allu Arjun baby Ayaan

A picture was appeared in some social networking sites. It says the picture was that of Allu Arjun son Ayaan.

వాడు మా అబ్బాయి కానే కాదు

Posted: 06/16/2014 09:10 AM IST
It is not my son picture allu arjun tweet

సెలబ్రెటీల పై గాసిప్స్ కి జనాలు చెవులు నిక్కబెడతారు. ఏ చిన్న సందు దొరికినా, వారికి సంబంధించిన ఫోటోలు దొరికినా వెబ్ మీడియాలు పలు వార్తలతో హోరెత్తిస్తాయి. ఎంతగా అంటే సదరు సెలబ్రెటీలు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునేంతగా. ఇంతకీ విషయం ఏంటంటే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత నెల రోజుల క్రితం తండ్రి అయిన విషయం తెలిసిందే. బన్నీకి జూనియర్ బన్నీ పుట్టడంతో ఆ బాబు ఎలా ఉన్నాడో చూడాలని ఆత్రుత ఉండటం సహజమే.

ఇంత వరకు ఆ బాబు ఫోటో బయటకు రాకపోవడంతో ఎప్పుడో అర్జున్ భార్య స్నేహారెడ్డి ఓ చిన్న బాబును ఎత్తుకొని దిగిన ఫోటో సంపాదించి, ఇదిగో ఇతడే జూనియర్ బన్నీ... అంటూ గత రెండు రోజుల నుండి ప్రచారం చేస్తున్నాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చాలా మంది షేర్ కొట్టి పండగ చేసుకున్నారు.

అయితే ఈ విషయమై అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ రాస్తూ..." సర్కులేట్ అవుతున్న ఫొటోలో స్నేహతో ఉన్న పిల్లాడు మా అబ్బాయి ఆర్యన్ కాదు. అతను మా మేనల్లుడు. దయచేసి అందరూ దాన్ని సర్కులేట్ చేయటం ఆపండి " అన్నారు.

ఇక ఫాదర్స్ డే సందర్బంగా తండ్రిగా తన అనుభవాలను చెబుతూ.. తన బాబు అయాన్ పుట్టి నెలరోజులు అయింది. వాడు మా ఇంట్లోకి వచ్చినప్పటి నుండి టైమే తెలియడం లేదు, ఏ మాత్రం సమయం దొరికినా వాడితో గడిపేస్తున్నారు. వాడు పుట్టినప్పుడు నాడు నా కొడుకా... మరచిపోని అనుభూతికి లోనయ్యినట్లు చెప్పుకొచ్చాడు.

వాడు పుట్టినప్పుడు పట్టుకోవడానికి నాకు భయం వేసింది. మూడు రోజుల తరువాత వాడిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. మన సాంప్రదాయం ప్రకారమే వాడికి ఆ పేరు పెట్టానని ఎంతో ఆనందంతో చెప్పాడు బన్నీ... జూనియర్ బన్నీ గురించి.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles