Nagababu imitate brother pawan kalyan

Nagababu imitate brother Pawan Kalyan, Naga babu in Chusinodiki chusinantha movie, Naga babu fallow pawan kalyan, Mega brother imitate power star,

Nagababu imitate brother Pawan Kalyan, Naga babu in Chusinodiki chusinantha movie, Naga babu fallow pawan kalyan, Mega brother imitate power star,

నాగబాబు పవర్ ని ఫుల్లుగా వాడుకున్నాడు

Posted: 06/16/2014 03:20 PM IST
Nagababu imitate brother pawan kalyan

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగుల్ని, పాటల్లోని పదాలను స్టార్ హీరోల దర్గర్నుండి చిన్న హీరోల వరకు అందరు వాడుకుంటారు. కొంత మంది ఆయన్ను ఇమిటేట్ చేస్తూ చేసిన పాత్రలు బాగా పేలాయి కూడా. ఇప్పుడు పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ ని మెగా బ్రదర్ అయిన నాగబాబు ఇమిటేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ సినిమాలోని సింహం డైలాగ్ కొట్టే సన్నివేశంలో పవన్ కళ్యాణ్ స్టైల్ ని ఉన్నది ఉన్నట్లు దించేశాడుఈ పవన్ కళ్యాణ్ డూపు.

ఈయన ప్రస్తుతం ‘చూసినోళ్లకు చూసినంత సినిమా ’ లో నటిస్తున్నాడు. ఈ సన్నివేశంలో నాగబాబు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగే రెడ్ టీ షర్టు వేసుకొని, మెడకు టీ షర్టు చుట్టుకొని, కళ్లజోడు పెట్టుకొని డైలాగు కొట్టడమే కాకుండా, చివరి పంచ్ నాదైతే ఆ కిక్కే వేరప్పా వరకు అదే స్టైల్, అదే ఎక్స్ ప్రెషన్స్ తో నాగబాబు చేసిన ఇమిటేట్ పవన్ కళ్యాణ్ ని తలపిస్తుంది. మెగా బ్రదర్ పవన్ ని ఇమిటేట్ చేసినా వార్తేనా అని మీరనుకోవచ్చు. విషయం ఏంటంటే... 2014 ఎన్నికలకు ముందు పవన్ పార్టీ పెట్టుకున్న సమయంలో నాగబాబు స్పందిస్తూ... నేను, మెగా అభిమానులు అన్నయ్య వెంటే అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఆ తరువాత నుండి మెగా ఫ్యామిలీ హీరోల మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నాగబాబు పవన్ ని ఇమిటేట్ చేయడం చూస్తుంటే మెగా హీరోలు త్వరలోనే కలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles