Sunny leone item song in ntr kummesta

Sunny leone item song in NTR kummesta, Sunny Leone in south movies, sunny Leone new item song in puri movie, sunny in kummesta movie

Sunny leone item song in NTR kummesta, Sunny Leone in south movies, sunny Leone new item song in puri movie, sunny in kummesta movie

సన్నీకి సూటి పెట్టిన పూరీ జగన్నాథ్

Posted: 05/26/2014 07:08 PM IST
Sunny leone item song in ntr kummesta

టాలీవుడ్ కి కొత్త కొత్త ఐటెం పోరీలను పరిచయం చేసి, వారిని పుల్లుగా వాడేసి, ఆ తరువాత వదిలేసే దర్శకుడు పూరీ జగన్నాథ్ గత కొంత కాలంగా అటువంటి ప్రయత్నాలేమి చేయట్లేదు. పాత వాళ్ళతోనే ఐటెం సాంగులు చేయిస్తున్న ఈయన త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.

దాదాపు దశాబ్దం తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న పూరీ ఎలాగైనా హిట్టు కొట్టాలని మంచి స్టోరీతో పాటు మసాలా కూడా  దట్టించాలని ఫిక్సయ్యి, ఐటెం సాంగ్ కొరకు ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నిలియోన్ ని సంప్రదించినట్లు టాలీవుడ్ ఫిలిం వర్గాల సమాచారం.

ఇప్పటికే సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీని టాలీవుడ్ టాప్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ సరసన పెట్టాలనే ఆలోచన రావడం ఓ రకంగా పెద్ద సాహసమే అయినా, ఎన్టీఆర్ దీనికి ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇక పూరీకి ఎంత హిట్లు లేకపోయినా పోర్న్ స్టార్ ని తీసుకొచ్చి ఇలా స్టార్ హీరో ప్రక్కన పెట్టడం ఏంటని మండి పడుతున్నారు.

పూరీ నిజంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా ? లేదా అన్నది సినిమా ప్రారంభం అయితేగానీ క్లారిటీ రాదు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles