Dil raju to do kannada remake with prabhas

Prabhas, Dil Raju, NTR and Allu, prabhas in kannada movie

Ugram which has won critics acclaim has impressed Prabhas and so the producer has taken the rights to do it with the hero.

కన్నడ సినిమా రీమేక్ లో ప్రభాస్

Posted: 04/28/2014 07:02 PM IST
Dil raju to do kannada remake with prabhas

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి ’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. రెండు సంవత్సరాల వరకు కాల్షీట్లు జక్కన్నకే కేటాయించిన ప్రభాస్ ఏ మాత్రం వీలు చిక్కినా ఈ గ్యాప్ లో ఓ చిత్రాన్ని కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఓ కన్నడ రీమేక్ లో నటించబతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. 

ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అక్కడి బాక్సాఫీసును షేక్ చేస్తూ దూసుకుపోతున్న ‘ఉగ్రం ’ సినిమా రీమేక్ లో ప్రభాస్ హీరోగా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు భాషల నిర్మాతలు ఈ సినిమాకు భారీ రేటు పెట్టి కొనేస్తే, టాలీవుడ్ బడా నిర్మతల్లో ఒక్కరైన దిల్ రాజు ఈ సినిమా హక్కుల్ని భారీ రేటు చెల్లించి దక్కించుకున్నాడని అంటున్నారు. మొదట ఈ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తాడని, తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడని ప్రచారం సాగినా చివరకు ఈసినిమా స్టోరీ, హై ఎమోషన్స్, యాక్షన్ ఉన్న సినిమాలో ప్రభాస్ అయితే కరెక్ట్ భావించి ఆయన్ను తీసుకోవాలని అనుకుంటున్నాడట.

గతంలో ప్రభాస్ హీరోగా రెండు సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఎలాగైనా ప్రభాస్ డేట్లు తీసుకోవాలని చూస్తున్నాడట. ప్రభాస్ డేట్లు ఇచ్చినా ఈయన గతంలో నటించిన కన్నడ ‘జోగి ’ రీమేక్  ‘యోగి ’లో నటించినా ఆశించిన ఫలితం రాలేదు. మరి ఇప్పుడు ఇందులో నటించడానికి అంగీకరిస్తాడా లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles