Radhika apte for pawan venkatesh film

Radhika Apte in Pawan-Venkatesh film, Oh My God remake, Balakrishna Legend heroine, Suresh Productions Banner

Radhika Apte has been roped into play the female lead in Pawan Kalyan and Venkatesh Oh My God remake.

బాలయ్య భామకు మల్టీస్టారర్ సినిమా ఛాన్స్

Posted: 04/21/2014 08:37 PM IST
Radhika apte for pawan venkatesh film

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రావడం లేదంటే... వచ్చిన ఒకరిద్దరు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఆయన సినిమాలో ఎప్పుడు ఏ హీరోయిన్ వచ్చి చేరుతుందో తెలియడం లేదు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్ ’ చిత్రాన్ని తెలుగులో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం మొదట నయనతారను తీసుకున్నారు. కానీ రేటు విషయంలో ఏ మాత్రం తగ్గక పోవడంతో ఆమెను సినిమా నుండి తప్పించారు. ఆమె స్థానంలో ఇటీవల బాలయ్య నటించిన ‘లెజెండ్ ’ సినిమా లో నటించిన రాధికా ఆప్టేను వెంకీ సరసన తీసుకున్నారు.  బాలయ్య తో నటించిన తరువాత ఈ అమ్మడుకు బాగానే అవకాశాలు వస్తున్నాయి.

హోమ్లీ లుక్ తో ఉండే ఈ అమ్మడు వెంకీకి సరిజోడు ఉంటుందనే తీసుకున్నారు.  ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం "దృశ్యం" షూటింగ్ లో వెంకటేష్ బిజీగా ఉన్నాడు. ఇందులో వెంకీ సరసన మీనా జోడి కట్టింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles