Allari naresh again veerabadhram direction

Allari Naresh, Veerabhadram, Biscuit Raja, Allari Naresh New Film, Allari Naresh Next Film, Allari Naresh And Veerabhadram Movie

Naresh is positive about the script narrated by his Aha Naa Pellanta director Veerabadhram.

బిస్కెట్ రాజాగా రాబోతున్న నరేష్

Posted: 04/15/2014 07:43 PM IST
Allari naresh again veerabadhram direction

టాలీవుడ్ లో నేటి తరం కమేడియన్ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో, డిఫరెంట్ టైటిల్స్ తో ప్రేక్షకుల్ని అలరిస్తాడు. ప్రస్తుతం ఇతడు వీరభద్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు టైటిల్ గా ‘బిస్కెట్ రాజా ’ పేరు పరిశీలిస్తున్నట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. చాలా టైటిళ్ళు పరిశీలించిన తరవాత అల్లరి నరేష్ టైటిల్ కి సరిపోయేదిగా ఉండటంతో దీనినే ఫైనల్ టైటిల్ గా నిర్ణయించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రానికి నిర్మాతలుగా భగవాన్, పుల్లారావులు వ్యవహరించనున్నారు. నాగార్జునతో భాయ్ సినిమా ప్లాప్ తరువాత చేస్తున్న చిత్రం కావడంతో ఎంతో కసితో ఉన్నాడు వీరభద్రమ్. స్క్రిప్టు వర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెల నుండి మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. కథానాయిక, మిగతా వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. నరేష్ ప్రస్తుతం ‘జంప్ జిలానీ ’ సినిమాలో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles