Mohan babu plays yama in yamaleela 2

Mohan Babu in Yamaleela 2, Mohan Babu Yamaleela 2, Movie Yamaleela 2, Movie First Look, Yamaleela 2 Movie First Look Launch, Mohan Babu plays Yama in YamaLeela-2

Mohan Babu in Yamaleela 2, Mohan Babu Yamaleela 2, Movie Yamaleela 2, Movie First Look, Yamaleela 2 Movie First Look Launch, Mohan Babu plays Yama in YamaLeela-2

ఇక పై యముడి పాత్రలు చేయనంటున్నాడు

Posted: 04/16/2014 10:15 AM IST
Mohan babu plays yama in yamaleela 2

టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకోవడమే తన నటనతో ఎన్నో అవార్డులతో పాటు పద్మ శ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న మోహన్ బాబు ఇక పై ఆయన పోషించిన ఓ పాత్రకు గుడ్ బై చెప్పబోతున్నాడు. పాత కాలం నటుల్లో కైకాల సత్యనారాయణ ‘యమలీల ’ సినిమాలో యముడు పాత్ర పోషిస్తే, నేటి తరంలో మోహన్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ ’ సినిమాలో యముడు పాత్ర పోషించి అందరి మన్ననలు పొందాడు. 

ఇప్పుడు కృష్ణారెడ్డి రూపొందించబోతున్న ‘యమలీల-2 ’ సినిమాలో ‘యముడు ’ పాత్ర పోషించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన  పరిచయ కార్యక్రమం రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు చెబుతూ, ‘‘యముడి పాత్ర పోషించడం నిజంగా ఓ అదృష్టం.ఈ సినిమా ద్వారా నాకది రెండోసారి లభించింది. దీని తర్వాత మాత్రం ఇక మరోసారి ఈ వేషం వేయను ’’ అని చెప్పడంతో అక్కడి వారు ఒక్కసారి షాక్ తిన్నారు.

ఆ పాత్ర పోషించాల్సి రావడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలతో కల్సి ఈ సినిమాకి పని చేస్తుంటే, బాపూ రమణల తో వర్క్ చేసినట్టుందన్నాడు. ఇటీవలే వర్మ సినిమాలో రౌడీ వేషం వేసిన మోహన్ బాబు ఇలాంటి పాత్రలు చేయాలంటే కాస్తంత ఇబ్బందిగా ఫీలయ్యే ఆ పాత్రలకు గుడ్ బై చెప్పాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles