Samantha to romance hero vikram

Samantha to romance Vikram, Samantha to romance Vikram, Samantha to romance hero Vikram, Samantha to romance with Vikram,

South Indian top actress Samantha is going to share the screen with hero Vikram in the upcoming untitled movie directed by Vijay Milton and produced by A.R.Murugadoss under his home banner.

విక్రమ్ తో సమంతా రొమాన్స్

Posted: 04/15/2014 07:13 PM IST
Samantha to romance hero vikram

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పరంగా టాప్ రేస్ లో దూసుకుపోతున్న సమంతా.... ఇప్పుడు అదే జోరును కోలీవుడ్ లో కూడా కొనసాగిస్తోంది. టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించిన ఈ అమ్మడు కోలీవుడ్ లో కూడా విజయ్, సూర్యా లాంటి స్టార్ల సరసన నటించి మెప్పింది.

ఇప్పుడు ఆమె హీరోల జాబితాలోకి మరో బడా హీరో వచ్చి చేరాడు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో విక్రమ్ కు జోడిగా సమంతను ఎంపిక చేశాడనికి కోలివుడ్ సమాచారం. విజయ్ ‘కత్తి ’ లో సమంత నటనకు ఇంప్రెస్ అయిన మురగదాస్, విజయ్ మిల్టన్ ఈ అమ్మడును ఏరి కోరి తీసుకున్నారట.

సూర్యా- లింగు స్వామి కాంబినేషన్ తెరకెక్కుతున్న 'అంజాన్', ముగురుదాస్-విజయ్ ల కలయికలో వస్తున్నా ‘కత్తి ’ చిత్రాలలో సమంతనే హీరోయిన్. ఈ చిత్రాలు సెట్స్ పైన ఉండగానే ఇన్ని ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంటే అక్కడ భామలు ఈమెలో ఏముందని ఆరా తీసే పనిలో పడ్డారట. నిజంగా సమంతా ఏ మాయ చేస్తుందో కానీ అవకాశాలు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles