Baahubali team in star of the week campaign

Star of the Week Campaign, ss rajamouli, baahubali, prabhas, rana daggubati, anushka shetty

Director SS Rajamouli Baahubali team has started a new campaign called Star of the Week to honour the technicians of the movie.

ఆర్టిస్టులకు అవార్డులిస్తున్న రాజమౌళి

Posted: 02/27/2014 08:45 PM IST
Baahubali team in star of the week campaign

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా హీరోలతో పాటు నటిస్తూ నటింపజేస్తాడు. బహుశా అందుకేనేమో ఆయన సినిమాలో హీరో యాక్టింగ్ కానీయండి, సన్నివేశాలు కానీయండి కళ్లకు కట్టినట్లు ఉంటాయి. అలా ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందుకున్న జక్కన్న తన దగ్గర పనిచేసే వారికి కూడా అవార్డులు ఇవ్వాలనుకున్నాడు. ప్రస్తుతం తాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి ’ సినిమా కోసం పనిచేస్తున్న వారికి బాహుబలి ‘స్టార్ ఆఫ్ ద వీక్ ’ పేరిట ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు.

అలా ఈ వారం గౌస్, లగాన్, శ్రీను అనే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులకు ఈ అవార్డు ప్రకటించారు. వీరు ముగ్గురూ తమ పని తాము సక్రమంగా చేయడమే కాకుండా, సుమారు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు కాస్ట్యూమ్స్ వేసుకోవడంలోనూ, మెడకు టైలు కట్టడంలోనూ, ఆభరణాలు ధరించడంలోనూ వీరు ఎంతగానో తోడ్పడ్డారని జక్కన్న పోస్ట్ చేశారు. ముందు ముందు ఎన్ని ప్రోత్సాహకాలు ఇస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles