Chiranjeevi at varun tej movie launching

Power Star Pawan Kalyan, Mega Star Chiranjeevi, Nagababu son, Varun Tej, Varun Tej enters films, Arangetram into film industry , mega Family, Director Srikanth Addala,

Chiranjeevi and Pawan Kalyan at Nagababu son Varun Tej movie launching.

మరో వారసుడ్ని వెండితెరకు పరిచయం చేసిన చిరు

Posted: 02/27/2014 01:32 PM IST
Chiranjeevi at varun tej movie launching

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీ రంగ ప్రవేశానికి ఈ రోజు ముహూర్తం కుదిరింది. ఎప్పటి నుండో ఇదిగో అదిగో అంటూ మెగా అభిమానుల్ని ఊరిస్తూ వచ్చిన వరుణ్ తేజ్ సినిమాకు ఈరోజు పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యుల మధ్య జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్రమంత్రి చిరంజీవి, ఆయన భార్య సురేఖ దేవుడికి పూజ చేసిన చిత్ర పటాలకు కొబ్బరికాయలు కొట్టి, ఆ తరువాత దేవుడి పటాల పై క్లాప్ కొట్టి షూటింగు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర రావు, డి. సురేష్ బాబు, వి.వి. వినాయక్, హీరో పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, అర్జున్, శిరీష్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో పాటు హీరో సునీల్ కూడా విచ్చేశాడు. ఈ చిత్రం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ఎవరైనా ఏం సంపాదించావు? అని అడిగితే అభిమానులను సంపాదించానని గర్వంగా చెబుతుంటానని తెలిపారు.తన జీవిత ప్రయాణంలో ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన వారసులుగా రాంచరణ్, బన్నీ, శిరీష్ ఉన్నారని మరో వారసుడు వరుణ్ తేజ్ ను సినీరంగానికి పరిచయం చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆరుడుగుల మూడంగుళాల అందగాడు వరుణ్ తేజ్ ను ఆదరించాల్సిన బాధ్యత అభిమానులదేనని ఆయన తెలిపారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles