Four movies starting with b after telangana bill approved in parliament

Four movies starting with B, Telangana Bill approved in Parliament, Bheemavarapu Bullodu movie, Basanti Movie, Bangaru Kodipetta movie, Bhadram horror movie

Four movies starting with B after Telangana Bill approved in Parliament

తెలంగాణా ఆవిర్భవిస్తున్న సందర్భంగా మూడు బకారాల సినిమాలు

Posted: 02/23/2014 12:24 PM IST
Four movies starting with b after telangana bill approved in parliament

ఈ వారం పైవారాలలో విడుదలవుతున్న చిత్రాలలో బకారంతో మొదలయ్యే సినిమాలు నాలుగుండటం కాకతాళీయంగా జరిగిపోతోంది. 

అవి, ఈవారంలో విడుదలౌతున్న సునీల్ నటించిన భీమవరపు బుల్లోడు, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ నటించిన బసంతి, వచ్చే వారానికి సన్నిద్ధమౌతున్న నవదీప్ నటించిన బంగారు కోడి పెట్ట, మరో భద్రం అనే తెలుగు అనువాదంలోని తమిళ సినిమా.  ఈ చిత్రాలన్నీ బ,భ లతో మొదలవటం విశేషం. 

సునీల్ కి అభిమానుల సంఖ్య బాగానే వుండటంతో భీమవరపు బుల్లోడు బాగానే పుంజుకుంటుందని అంచనాలు వస్తున్నాయి.  అలాగే బ్రహ్మానందం మీద ఉన్న అభిమానం ఆయన కుమారుడి సినిమాను చూడటానికి ప్రోత్సహించే అవకాశం ఉంది. 

ఇక పై వారం విడుదలయ్యే బంగారు కోడిపెట్టలో నవదీప్ రాణించేదాన్నిబట్టి ఆ సినిమా విజయమే కాకుండా నవదీప్ భవిష్యత్తు కూడా ఆధారపడివుంటుంది.  భద్రం సినిమాకి వచ్చేటప్పటికి అది భయానకమైన సినిమా కాబట్టి, అటువంటి సినిమాలను ఇష్టపడేవారు దాన్ని ఆదరించవచ్చు. 

అలా తెలంగాణా రాష్ట్రానికి పార్లమెంటులో ఆమోదం లభించిన తర్వాత ఇరుప్రాంతాలలో నాలుగు బకారాల సినిమాలు బరిలోకి దూకుతున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles