Nitin comments on director maruthi

Nitin Comments on director Maruthi, Nitin Comments on director Maruthi, Nithin Counter On Maruthi, Nithin Punch to Maruthi

Nithin says that Maruthi did many vulgar films recently but he is trying to change it, I hope Radha and Lovers movie are clean films.

గెస్ట్ గా పిలిస్తే పంచ్ వేసి వెళ్లాడు

Posted: 02/21/2014 05:27 PM IST
Nitin comments on director maruthi

రెండు వరుస హిట్ సినిమాలు చేసి మంచి ఫాంలో వచ్చి, బడా దర్శకులతో సినిమాలు చేస్తున్న హీరో నితిన్ స్టార్ డమ్ కూడా ఓ రేంజ్ లో పెరిగి సినిమా ఆడియో ఫంక్షన్లకు గెస్టుగా వచ్చే స్థాయికి వచ్చాడు. మాయాబజార్ మూవీస్ పతాకంపై సుమంత్ అశ్విన్, నందిత జంటగా తెరకెక్కిస్తున్న లవర్స్ చిత్రం టీజర్ విడుదలకు నితిన్ గెస్ట్ గా వచ్చి  విడుదల చేశాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఎలాగు గెస్టుగా వచ్చాను కదా అని ఈ సినిమాను నిర్మించిన దర్శకుడు మారుతి పై నాలుగు సెటైర్లు వేశాడు. బూతు చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నమారుతి నుంచి వస్తున్నలవర్స్ సినిమా. చాలా క్లీన్ గా ఉంటుందని నమ్ముతున్నానని, ఇక నుంచి ఆయన క్యాంప్ నుంచి వచ్చే సినిమాలన్నీ చాలా క్లీన్ గా బూతులు లేకుండా  ఉంటాయని నేను ఆయన తరపు నుంచి మాటిస్తున్నానని అనడంతో అక్కడున్న మారుతి ఒక్కసారి ఖంగుతిన్నాడు.

ఇప్పుడిప్పుడే ఆ ఇమేజ్ నుండి బయట పడటానికి మారుతి వెంకీతో, అల్లు శిరీత్ తో చిత్రాలు తీస్తున్నాడు. నితిన్ వచ్చి ఇలా మాట్లాడి మరోసారి పాత రోజుల్ని గుర్తుకు చేశాడని, ఈయన్ను పిలవడమే తప్పని అనుకున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles