Auto nagar surya not coming on march 27

Auto Nagar Surya, coming on March 27, director deva katta, tweets, release date

Auto Nagar Surya not coming on March 27. director deva katta, tweets, release date

ఆటో ఈనెల 27న రావడం లేదా ?

Posted: 02/21/2014 08:46 PM IST
Auto nagar surya not coming on march 27

చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు దేవాకట్టా నాగచైతన్య తో ‘ఆటో నగర్ ’ సూర్య సినిమాను తెరకెక్కించాడు. ఎంతో కష్టపడి రూపొందిన ఈ సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోక పోగా, షూటింగ్ సమయంలో అవాంతరాలు ఎదురయ్యాయి. వాటన్నింటిని చేదించుకొని ఈ నెల 27  ఆరు నూరైనా ఆటోకు బ్రేకులు వేసేది లేదని చెప్పారు చిత్ర యూనిట్.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మళ్లీ వాయిదా పడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారైనా విడుదల అవుతుందని ఆశగా ఎదురు చూశాడు దర్శకుడు. కానీ తాను ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ‘ఆటో ’ ఆ రోజు రావడం లేదని తెలుస్తుంది. ఏ సినిమా అయినా రిలీజ్ విషయానికి వస్తే, ఆ సినిమా దర్శకుడు కూడా ప్రేక్షకుడు లాంటి వాడే. తనకి వేరే దారి లేదు... నిర్మాతలు చెబితే అది నమ్మాల్సిందే. అంటూ తన బాధను వెల్లడించాడు.

ఈ సినిమా తరువాత నుండి వేరే ప్రాజెక్టు మొదలు పెట్టలేక, ఆ సినిమా రిజల్టు కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నాడు దేవాకట్టా. ఈ ఆటో ఎప్పటికి వస్తుందో దానికి తెలియని పరిస్థితి ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles