Pawan gabbar singh 2 movie launched

gabbar singh 2, pawan kalyan, sampath nandi, sharat marar

Power Star Pawan Kalyan, director Sampath Nandi movie Gabbar Singh 2 opening ceremony was held in Hyderabad on Feb 21.

పవన్ సినిమా ఎట్టకేలకు ప్రారంభం అయింది

Posted: 02/21/2014 03:56 PM IST
Pawan gabbar singh 2 movie launched

ఎన్నో రోజుల నుండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ - సంపత్ నంది కాంబినేషన్ సినిమా ‘గబ్బర్ సింగ్ 2 ’ ఎట్టకేలకు నేడు ప్రారంభోత్సవం జరుపుకుంది. నేటి ఉదయం ఫిలింనగర్ లోని దైవ సన్నిదానంలో ఈ చిత్రానికి లాంఛనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు చిత్ర నిర్మాత శరత్ మరార్ తండ్రి జీకే మరార్ తో పాటు ప్రముఖ న్యాయవాది ప్రమోద్ రెడ్డి హాజరయ్యారు.

దేవుడి విగ్రహాల పై కొన్ని ముహూర్తపు సన్నివేశాలను చిత్రీకరించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శరత్ మరార్ తండ్రి జీకే మరార్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ ప్రొడక్షన్ చీఫ్ ప్రకాష్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ న్యాయవాది ప్రమోద్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఇన్ని రోజులు ఫిలిం నగర్లో సంచరించిన వార్తలే నిజం అయ్యాయి. ఈ చిత్రానికి సంపత్ నంది పేరుకే అని, అన్నీ పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలోనే (కథ, రచన) జరుగుతాయని నిర్మాత శరత్ మరార్ చెప్పాడు. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తామన్నారు. ఇక ఈ చిత్రం గబ్బర్ సింగ్ కి సీక్వెల్ కాదని, ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడని, హీరోయిన్ ఇంకా ఎంపిక కాలేదని నిర్మాత చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles