Mohan babu rowdy first look

Mohan Babu Rowdy First Look, ram gopal varma, rowdy, mohan babu, vishnu manchu,

Filmmaker Ram Gopal Varma (RGV) has released first look poster of actor Dr Mohan Babu and his son Vishnu Manchu in Telugu action film Rowdy on February 21.

మోహన్ బాబు ‘రౌడీ ’ గా అదుర్స్

Posted: 02/21/2014 02:35 PM IST
Mohan babu rowdy first look

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో త్వరలో ‘రౌడీ ’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. పైన ఫోటోలో కనిపిస్తున్న చిత్రం అదే. ఈ ఫోటోలో లుంగీ కట్టుకొని నిల్చున్న వ్యక్తే మోహన్ బాబు. ఈయన ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వర్మ ప్రస్తుత సమకాలీన రాజకీయాల పై తనదైన సెటైర్స్ తో తెరకెక్కించబోతున్నాడు.

అత్యాధునిక టెక్నాలజీతో మోహన్ బాబును విలక్షణమైన గెటప్ లో చూపించబోతున్న ఈ సినిమా షూటింగు త్వరలో ప్రారంభించబోతున్నాడు. షార్ట్ టర్మ్ లో సినిమాను తెరకెక్కించే వర్మ ఈ సినిమాను కూడా సాధ్యమైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల చేయాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన తారా గణాన్ని, మోహన్ బాబు సరసన హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. బాలక్రిష్ణ లాంటి వారికే హీరోయిన్లు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో మోహన్ బాబు సరసన నటించడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles