Pawan health reason behind gabbar singh 2 delay

Pawan Kalyan, Gabbar Singh-2 Movie Delay,Pawan suffering from back pain, Reason Behind Gabbar Singh-2 Delay, Sharath Marar, Pawan Kalyan Creative Works,

Pawan Health Reason Behind Gabbar Singh-2 Delay. Pawan Kalyan is sensing from back pain for some time and it became a bit cautious in recent times.

గబ్బర్ సింగ్ 2 వాయిదాకు కారణం ఇదా ?

Posted: 02/04/2014 04:37 PM IST
Pawan health reason behind gabbar singh 2 delay

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది ’సినిమా తదుపరి ‘గబ్బర్ సింగ్ -2 ’ ఉంటుందని దీనికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతున్నాయని ప్రారంభోత్సవం చేసుకోవడమే ఆలస్యం అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమా మొదలు కాలేదు. దీనికి అనేక కారణాలు వినిపించాయి. వినిపిస్తున్నాయి. వాటన్నింటి సంగతి ప్రక్కన పెడితే ఈ చిత్రం మార్చి చివర్లో కానీ, ఏప్రిల్ మొదట్లో కానీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. మరి ఇన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడటం వెనక అసలు కారణం ఇదే అంటున్నారు సినిమా జనాలు.

ఇన్ని రోజుల నుండి హీరోయిన్ దొరక్కపోవడమే కారణం అన్నా.... నిజానికి మాత్రం పవన్ కొన్ని రోజుల నుండి నడుం నొప్పి (బ్యాక్ పెయిన్) తో బాధ పడుతున్నాడని, గతంలో నుండే ఈ బాధ ఉన్నా ఇటీవలి కాలంలో అదికాస్తంత ఎక్కువగా భాదించడంతో దీనికి చికిత్స చేయించుకున్న కారణంగానే వాయిదా వేస్తూ వచ్చారట. ప్రస్తుతం దాని నుండి కోలుకున్న పవన్ ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్ మాత్రం ఇంకా అఫీషయల్ గా ఖరారు కాలేదు. ఇన్ని రోజుల పవన్ ఇలా బాధ పడ్డాడా అని పవన్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles