Shruti hassan to romance with mahesh babu

Actress Sruthi Hassan, Mahesh Babu, Nagarjuna and Aishwarya rai, Sruthi Hassan,Mani Ratnam,Tollywood, Telugu Movies,Super Star Mahesh Babu

Shruti Hassan to romance with Mahesh Babu. Shurthi Hassan grabbed the chance to romance with Prince Mahesh Babu-Mani Ratnam film.

మణి సినిమా శ్రుతికి లక్కీ ఛాన్స్

Posted: 01/31/2014 09:36 AM IST
Shruti hassan to romance with mahesh babu

సౌత్ ఇండియా హీరోయిన్స్ అందరు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక్కసారైనా జత కట్టాలని ఉవ్విళ్ళూరు తుంటారు. కానీ ఆ ఛాన్స్ అందరికి రాదు. వచ్చిన వారు వదులుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు అలాంటి ఛాన్సే వచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రుతి హాసన్. త్వరలో మణిరత్నం టాలీవుడ్ , కోలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో మహేష్ సరసన శ్రుతి హాసన్ ని  ఎంపిక చేసుకున్నారని చెన్నయ్ వర్గాల సమాచారం.

మణి రత్నం ఈ సినిమా కోసం శ్రుతిని అడగటంతోనే ఏమీ ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుందని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తొలిసారి శ్రుతికి మహేష్ సరసన ఛాన్స్ దక్కినట్లువుతుంది. ఇందులో మరో హీరో నాగార్జున, ఐశ్వర్యరాయ్ కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఐష్ మహేష్ సినిమాలో నటిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది కూడా. మొత్తంగా చూస్తే భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందించబోతున్నాడని అర్థం అవుతుంది. అన్నీ కుదిరితే ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ పైకి వేళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles