M m keeravani retirement from 2016

MM Keeravaani, Music composer, keeravani retirement, 2016 Dec 08, music director keeravani,mm keeravani,keeravani songs, keeravani hits, Keeravani music director

Music director MM Keeravaani has announced his retirement from 2016 Dec 08 in films.

ఎం.ఎం. కీరవాణి రిటైర్మెంట్ ప్రకటించాడు

Posted: 01/30/2014 05:38 PM IST
M m keeravani retirement from 2016

కొంత మంది జీవితంలో ఒక స్టేజ్ వరకు మాత్రమే కష్టపడి తరువాత విశ్రాంతి కోరుకుంటారు. మరి కొంత మంది ఈ భూమ్మీద ఉన్నన్ని రోజులు ఏదో పని చెయ్యాలనుకుంటారు. మొదటి రకానికి చెందిన వాడే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరణవాణి. తొంభైవ దశకం నుండి నేటి వరకు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన సంగీతంతో, అప్పుడప్పుడు గొంతుతో అలరిస్తున్నా ఈయన సంగీత ప్రస్థానం నుండి 2016 డిసెంబర్ 8వ తరువాత తప్పుకోబోతున్నాడని, దీనికి సంబంధించిన సమాచారాన్ని తన ఫేస్ బుక్ వాల్ మీద పెట్టాడని అంటున్నారు సినీ జనాలు.

1989 డిసెంబర్ 8వ తేదీన చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్‌లో తన తొలిపాట కంపోజింగ్ తో మొదలైన సంగీత ప్రస్థానానికి 2016 తరువాత తెర పడబోతుందన్న మాట. ఈ వార్త సంగీత ప్రియులకు ఒకరకమైన బ్యాడ్ న్యూసే అయినా అది ఆయన సొంత నిర్ణయం కాబట్టి ఎవ్వరమూ కాదనలేము. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎంతో మందిని అలరించిన ఆయన జాతీయ అవార్డుల పాటు ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్న కీరవాణి త్వరలోనే పూర్తి వివరాలతో మన ముందుకు వస్తానని చెప్పాడు.

దాదాపు మూడేళ్ల తర్వాత జరగనున్న రిటైర్‌మెంట్ సంబరాన్ని తన ప్రస్థానం మొదలు పెట్టిన ప్రసాద్ స్టూడియోస్ (హైదరాబాద్ లో ) పరిశ్రమ మిత్రులు, సన్నిహితుల మధ్య చేసుకోనున్నట్లు ప్రకటించాడు. మొత్తానికి కీరవాణి తీసుకున్న ఈ నిర్ణయం కాస్త కఠువుదే అయినా దాన్ని ప్రేక్షకులు అంగీకరించక తప్పదు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles