Akkineni complete the manam movie part

akkineni complete manam movie , Manam Movie Not Effect with ANR, ANR Death, Akkineni Part complete,

akkineni complete the manam movie part, Manam Movie Not Effect with ANR Death, No Problem with Manam Movie Over ANR Death

అక్కినేని పని పూర్తి చేసే వెళ్లిపోయాడా ?

Posted: 01/23/2014 06:02 PM IST
Akkineni complete the manam movie part

సినిమా పరిశ్రమలో ఎన్నో అవార్డులు, ఎన్నో బిరుదుల, ఎంతో పేరు సంపాదించుకోవడమే కాకుండా టాలీవుడ్ సినిమా ఇంటస్ట్రీకి ఓ కన్నులా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు తన సినిమా జీవిత కాలంలో అన్ని పనులు పూర్తి చేసే ఈ లోకాన్ని విడిచి వెళ్లారా ? కొన్ని మిగిల్చి వెళ్లారా ? అంటే దీని పై కొంత క్లారిటీ రావాల్సి ఉంది.

విషయం ఏంటేంటే అక్కినేని తన నట వారుసులతో కలిసి చివరిగా ‘మనం ’ సినిమాలో నటించారు. అయితే ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాలేదని , వెళుతూ వెళుతూ ఇక్కడే కొంత మిగిల్చి వెళ్లాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగు చివరి దశలో ఉన్న ఈ సినిమా లో ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకణ పూర్తి అయ్యిందని, తన డబ్బింగ్ పార్టు కూడా పూర్తి చేశారని, అన్నీ అయ్యాకే ఆయన అనారోగ్యం విషయం బయటకు వచ్చిందని చిత్ర యూనిట్ వర్గాల వారు అంటున్నారు.

ఒకవేళ తన వంతు పూర్తి చేసి వెళితే అన్ని పనులు పూర్తి చేసే వెళ్లిన వాడవుతాడు. ఉగాదికి ఈ సినిమా విడుదలవుతుందనీ, అక్కినేని అభిమానులకు ఇది మరపురాని అనుభూతిని ఇస్తుందనీ చెబుతున్నారు. విక్రంకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య మూడు తరాల ప్రతినిధులుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles