1 nenokkadine sequel title 1 1

Sukumar, Arya, One Nenokkadine, Mahesh, Sequel, 1+1 title for 1 nenokkadine title, mahesh babu 1 nenokkadine sequel

1 Nenokkadine Sequel gets Title | Mahesh's 1- Nenokkadine Part 2 Title Confirmed Sequel For 1 Nenokkadine, sukumar to direct 1 nenokkadine sequel

సుకుమార్ 1+1 ఆఫర్ ఇస్తున్నాడు

Posted: 01/23/2014 07:07 PM IST
1 nenokkadine sequel title 1 1

సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ‘1’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టెక్నికల్ గా హాలీవుడ్ స్థాయిలో ఉందని పేరు వచ్చినా, టాలీవుడ్ ప్రేక్షకుల్ని మాత్రం రీచ్ కాలేక బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టింది. ఈ సినిమాను కొన్న ఈరోస్ సంస్థకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి.

కలెక్షన్ల  మాట ఎలా ఉన్నా, జనాలు ఈ చిత్రాన్ని ఆదరించకపోయినా కానీ సుకుమార్ మరోసారి మహేష్ తో సినిమా చేయడానికి సిద్దం అవుతున్నాడు. మహేష్ కూడా మరోసారి సుక్కుతో సినిమా చేయడానికి సిద్దపడి చిత్రం విడుదల తరువాత మెసేజ్ కూడా చేశాడు. మొదటి సారి ఎలాగూ ఫెయిల్ అయ్యాం కాబట్టి ఈ సారి భారీ హిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మహేష్ కోసం మంచి కథను తయారు చేసే పనిలో ఉన్నాడు. కథ పూర్తి కాగానే మహేష్ కి కథ వినిపించనున్నాడట.

వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే ఈ సినిమాను ‘1’ కి సీక్వెల్ గా ఉంటుందని దానికి ‘1+1’ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ టైటిల్ పై మహేష్ ఏమంటాడో కానీ సుక్కు దీనికే ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ శీనువైట్ల సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత మరో రెండు ప్రాజెక్టులకు కమీట్ అయ్యాడు. ఈ సినిమా పట్టాలెక్కాలంటే కనీసం రెండేళ్ళు పడుతుంది. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles