Shraddha das meets sourav ganguly

Sourav Ganguly, Shraddha Ganguly, Shraddha Das telugu, Shraddha Das, Royal Bengal tiger,

Shraddha Das is on cloud nine. The Bengali actress long time dream has finally come true as she met former Indian captain Sourav Ganguly.

బెంగాళీ భామ కోరిక బెంగాల్ దాదాతో...

Posted: 01/23/2014 10:44 AM IST
Shraddha das meets sourav ganguly

వెండితెర పై హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రద్దాదాస్ మాజీ క్రికెటర్, కోల్ కత్తా ప్రిన్స్ గంగూలీని కలిసి తన చిరకాల కోరిక తీర్చుకుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్ ’ సినిమాలో హాట్ హాట్ అందాల ప్రదర్శనతో పాటు విలనిజాన్ని కూడా పోషించిన ఈ అమ్మడు బెంగాళీలో ‘రాయల్ బెంగాల్ టైగర్ ’ అనే సినిమాలో  నటించింది. 

ఈ సినిమా ప్రచారం కోసం కోల్ కత్తా వెళ్లిన ఈ అమ్మడు తన చిత్ర యూనిట్ తో కలిసి అక్కడ బుల్లితెర పై వచ్చే ‘దాదాగిరి ’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గంగూలీని చూసి తెగ ఆనంద పడిపోవడమే కాకుండా, గంగూలీ ని కలవడం నా అదృష్టం. నేను ఆయన్ను కలుస్తానని కలలో కూడా అనుకోలేదని ట్వీట్ చేసింది. గంగూలీ ప్రక్కనే ఉండటంతో కావాల్సినన్ని ఫోటోలు కూడా తీయించుకున్న ఈ అమ్మడు   వాటిని చూస్తూ తెగ సంబర పడిపోతుంది. ఇదేం ఆనందమో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles