Nagarjuna son akhil confirms debut in 2014

Akkineni Akhil entry conform,Akkineni Nagarjuna announce, Akkineni Akhil debut 2014, Akkineni Akhil with Anandi, heroine Anandi

Akhil Akkineni, youngest son of actor-producer Akkineni Nagarjuna, who has been waiting for the right time to enter filmdom has confirmed that he is confident of making his cinematic debut this year but hasn't signed any project yet.

అఖిల్ ఎంట్రీ + హీరోయిన్ ఖరారు ?

Posted: 01/02/2014 07:26 PM IST
Nagarjuna son akhil confirms debut in 2014

సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుండి అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఎంట్రీ ఉండబోతుందని వార్తలు వస్తున్నా, ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ కొత్త సంవత్సరం కానుకగా అక్కినేని అభిమానులకు నాగార్జునే స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు.

దీంతో ఇన్ని రోజులు వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. ఈ సంవత్సరంలో అఖిల్ ఎంట్రీ ఉంటుందని, ఆ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తానని, పెద్దవాడు నాగ చైతన్య విషయంలో తప్పు చేశానని అఖిల్ విషయంలో అలా చేయనని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వార్త పై అఖిల్ ఫుల్ జోష్ లో స్పందిస్తూ.... సినిమా హీరో కావాలన్న తన కల ఈ సంవత్సరం నెరవేర బోతుంది. మీ అందరి ప్రోత్సాహంతో వెండితెరకు పరిచయం కాబోతున్నాను. ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సంవత్సరం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.

కానీ దర్శకుడు ఎవరన్ని మాత్రం ఖరారు కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. ఈయన ఎంట్రీ ఖరారు కావడంతో ఈయన ప్రక్కన ఎవరు నటించబోతున్నారనే దాని పై అప్పుడే చర్చ మొదలైంది. ఫిలింనగర్ నుండి మాత్రం ఈయన సరసన హీరోయిన్ కన్ ఫర్మ్ అయిందని అంటున్నారు. ఆమె ఎవరో కాదు... ఇటీవల నాగార్జున నిర్మించిన ‘ఉయ్యాలా జంపాల ’ సినిమా హీరోయిన్ అవిక. (ఆనంది). గతంలో శ్రీదేవి కూతరుతో ఉంటుందని, నాగబాబు కూతురుతో ఉండబోతుందని వార్తలు వచ్చిన విషయం విధితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles