Pawan dance practising to sampath nandi movie

Pawan Dance Practising to Sampath nandi movie, Pawan Kalyan Practising Dance for Gabbarsingh 2,Pawan Kalyan Gabbarsingh 2,Sampath Nandi Gabbarsingh movie

Pawan Dance Practising to Sampath nandi movie, Pawan Kalyan Practising Dance for Gabbarsingh 2,Pawan Kalyan Gabbarsingh 2,Sampath Nandi Gabbarsingh movie

పవన్ కళ్యాణ్ స్టూడెంట్ గా మారాడు

Posted: 12/05/2013 05:54 PM IST
Pawan dance practising to sampath nandi movie

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువత స్టైల్ కి ఒక ఐకాన్. ఈయన హెయిర్ స్టైల్ , డ్రెస్సింగ్ ని చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రియల్ ఫైట్స్, స్టన్నింగ్ ఫీట్స్ తో విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకొని అది ఇప్పుడు ఒక మేనియాలాగ తయారయ్యి ‘పవనిజం ’ గా మారింది.

యాక్షన్, ఎమోషన్, డైలాగ్ సీన్లలో అదరగొట్టే పవన్ డాన్సుల్లో మాత్రం అంతంతే. మెగా ఫ్యామిలీ లో అప్పుడు చిరు, ఇప్పుడు చరణ్, అర్జున్ డాన్సుల్లో ఇరగ దీస్తుంటే పవన్ మాత్రం డాన్సుల్లో వెనకబడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఏదో కొరియోగ్రాఫర్ చెప్పినట్లు కాళ్ళు చేతులు ఆడించి చేతులు దులుపుకుంటాడు. ఆ మాత్రం ఆడించడానికి కూడా తెగ సిగ్గుపడే పవన్ చాలా సందర్భాల్లో నాకు డాన్సుల అంతగా రావని ఓపెన్ గా చెప్పుకున్న సందర్భాలు ఎన్నో.

కానీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాబోతున్న ‘గబ్బర్ సింగ్ ’ సీక్వెల్ లో మాత్రం తన డాన్స్ లతో విరగ తీద్దామని పవన్ డిసైడ్ అయ్యి, టాలీవుడ్ లోని ఒక ప్రముఖ కొరియో గ్రాఫర్ నేతృత్వంలో ప్రతిరోజు రెండు మూడు గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎలాగు యాక్షన్, రొమాన్స్ లో ఇరగదీసే పవన్ ఈ ఒక్క లోటును తీర్చుకొని అభిమానుల్ని ఇక పై అలరిస్తాడట. ఇప్పటికే వేసే స్టెప్పులకు ఈలలు వేసే ఫ్యాన్స్ పవన్ ఓ రేంజ్ లో డాన్స్ ఇరగదీస్తే థియేటర్లు బద్దలు అవ్వడం ఖాయం ఏమో.

ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే షూటింగు పూర్తి కావాల్సి ఉన్నా, స్క్రిప్ట్ లో కొద్దిగా మార్పులు ఉండడంతో ముందుగా ఈ సినిమాను ఈ నెలాఖరు నుండి పాటల చిత్రీకరణతో మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది ఆ చిత్ర యూనిట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles