Mumbai court orders fresh trial in salman hit and run case

Mumbai Court orders fresh trial in Salman case, Salman Khan latest news, Salman Khan Controversy, Court, Salman Khan Hit and Run Case, Trial

Mumbai Court orders fresh trial in Salman hit-and-run case.

సల్మాన్ కేసు మళ్ళీ మొదటి నుండి

Posted: 12/05/2013 05:43 PM IST
Mumbai court orders fresh trial in salman hit and run case

ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం చేసిన చిన్న తప్పు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జీవితంలో ఆ తప్పు చెరగని మచ్చ వేసింది. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో సల్మాన్ ఖాన్ నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో ఇతని పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నిర్లక్ష్యంగా కారు నడిపడమే ఈ ప్రమాదానికి కారణం అని, దానికి సంబంధించిన సాక్ష్యాలున్నాయని న్యాయనిపుణులు వెల్లడించారు. ఒకవేళ నేరం రుజువైతే 10 ఏళ్ళ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పడంతో ఈ కేసును మళ్ళీ విచారించాలని న్యాయస్థానానికి సల్మాన్  విజ్ఞప్తి చేశాడు. ఈయన విన్నపాన్ని మన్నించిన కోర్టు మళ్లీ కొత్తగా కేసును విచారించాలని, ఇందులోని సాక్ష్యులందరిని మళ్ళీ విచారించాలని ఆదేశించడంతో ఈయనకు కాస్తంత ఊరట లభించినట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles