Mahesh 1 audio function live on 350

mahesh 1 audio function live on 350! 1-Nenokkadine Audio Release on December 19th, Superstar Mahesh Babu, Mahesh Babu Fans

mahesh 1 audio function live on 350! 1-Nenokkadine Audio Release on December 19th

మహేష్ బాబు ఆడియో లైవ్ షో 350?

Posted: 12/04/2013 12:39 PM IST
Mahesh 1 audio function live on 350

ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ కొత్త ప్రయోగానికి తెర లేపారు. ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం మహేష్ బాబు చేస్తున్నారు. మహేష్ బాబు నటిస్తున్న 1 నేనొక్కడినే ఆడియో వేడుక ఈ నెల 19 న జరగబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమా ఆడియో వేడుకను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నరని టాలీవుడ్ టాక్ . అయితే ఈ ఆడియో వేడుకని అందరూ చూడాలనే ఉద్దేశంతో మొట్ట మొదటి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్స్ లో ఆడియో లాంచ్ లైవ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

 

ఏయే ఏరియాల్లో ఏయే థియేటర్స్ లో వేస్తారు అనే వివరాలను త్వరలోనే తెలియజేయనుండగా మొత్తం 350 థియేటర్స్ పైనే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయటానికి మహేష్ బాబు పూనుకున్నట్లు టాలీవుడ్ సమాచారం. కాగా మహేష్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2014 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాను ఈరోస్ సంస్థ సొంతం చేసుకుంది.దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని ఈ నెల 19న శిల్పకళావేదికలో రిలీజ్ చేయనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles