Anushaka vanra movie disaster

Anushaka vanra movie Disaster, Anushka, Varna, Arya, Selva raghavan, Disaster, 50 corers budget movie

Anushaka vanra movie Disaster, Anushka, Varna, Arya, Selva raghavan, Disaster, 50 corers budget movie

అనుష్క వాటిలో ఒకటి జారిపోయింది

Posted: 11/23/2013 05:41 PM IST
Anushaka vanra movie disaster

టాలీవుడ్ లో ప్రస్తుతం మూడు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ మరో రెండు సంవత్సరాల వరకు కాల్షీట్లు లేని హీరోయిన్ అనుష్క. ఈమె నటించిన భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘వర్ణ ’ చిత్రం నిన్ననే విడుదల అయింది. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి దీని గురించి జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు.

ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తుండటం, అనుష్క ముఖ్యపాత్ర పోషించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పివిపి నిర్మిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుష్క కూడా చాలా రోజుల తరువాత తెలుగు నటించిన భారీ బడ్జెట్ కావడంతో చాలా ఆశలే పెట్టుకుంది. తీరా సినిమా రిలీజయ్యాక సినిమాకి వచ్చిన టాక్‌ అనుష్కతోపాటు, చిత్ర దర్శక నిర్మాతల్నీ డీలా పడేలా చేసింది. ఎంత ఖర్చు చేసి ఏం లాభం.? సినిమాలో కంటెంట్‌ లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

గతంలో ఈమె నటించిన ‘అరుంధతి ’ సినిమా కోట్లు కొల్లగొట్టడంతో ఈమెను నమ్మి నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తే... ఇప్పుడు వారిని నట్టేట ముంచింది. ఈ సినిమాకు ఖర్చు పెట్టిన యాభై కోట్లు ఒక్కరోజులోనే ‘బూడిదలో పోసిన పన్నీరు ’లా పోయాయని వారు లబో దిబో అని మొత్తుకుంటున్నారు. వర్ణ సంగతలా వుంటే, రుద్రమదేవి, బాహుబలి సినిమాలు కూడా అనుష్కను బేస్ చేసుకొనే నిర్మాణం జరగుతున్నాయి. ఈ సినిమా ప్రభావం తప్పక వాటి పై ఉంటుందని విశ్లేషకులు అంటుంటే... అనుష్క చేస్తున్న మూడింట్లో ఒకటి చేజారిపోయిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles