Pawan kalyan scripting gabbar singh 2 story

pawan Kalyan scripting in Gabbar Singh 2, pawan Kalyan Involve in Gabbar Singh 2, Pawan scripting Gabbar Singh 2,

Tollywood is that Pawan Kalyan has scripted the story for Gabbar Singh 2. As known, the sequel to the successful Gabbar Singh is being planned and the director of the sequel.

పవన్ మళ్ళీ వేలు పెడుతున్నాడు ?

Posted: 11/08/2013 09:49 AM IST
Pawan kalyan scripting gabbar singh 2 story

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో నటించే కళనే కాకుండా కలం పట్టి స్టోరీలు రాయడం, దర్శకత్వం చేయడం, సినిమాలు నిర్మించడం వంటి అలవాట్లు కూడా ఉన్నాయి. ఇలా తనలో ఉన్న కళలన్నీ ఇదివరకే ప్రదర్శించి చేతులు కాల్చుకొన్నాడు కూడ.

ఆ తరువాత నుండి ఎందులో వేలు పెట్టకుండా దర్శకుడు చెప్పినట్లు చేసుకుంటూ పోతున్న పవన్ కి చాలా కాలం తరువాత ‘గబ్బర్ సింగ్ ’ రూపంలో భారీ హిట్ వచ్చి పడింది. ఆ తరువాత పూరి దర్శకత్వంలో నటించినా అది ఓ మోస్తారుగానే ఆడింది. ఆ తరువాత ‘అత్తారింటికి దారేది ’ తో నెంబర్ వన్ హీరో అయిపోయిన పవన్ మళ్ళీ తనలో ఉన్న కళలను బయటపెట్టడోతున్నట్లు సమాచారం. త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో చేయబోయే ‘గబ్బర్ సింగ్ -2’ సినిమాను వేదికగా చేసుకున్నట్లు సమాచారం.

అప్పట్లో తాను చేసిన కొన్ని ప్రయోగాలు సక్సెస్ కావడంతో ఇందులో తన చేతివాటాన్ని ప్రదర్శించేందుకు సిద్దం అవుతుండటంతో ఇన్ని రోజులు ఎంతో కష్టపడి రాసుకున్న తన స్క్రిప్టులో వేలు పెడితే.... గతంలోలాగే పరాజయం పాలైతే తన పరిస్థితి ఏంటని సంపత్ నంది లోలోపల తెగ ఫీలవుతున్నాడని అనుకుంటున్నారు.

వరుసగా రెండు విజయాలు రావడంతో మళ్ళీ ప్రయోగాలు చేసి పరాజయాల్ని మూటగట్టుకోవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles