Isha chawla in allari naresh film

allari naresh romance with isha chawla,allari naresh,isha chawa,allari naresh upcoming movie,isha chawla upcoming movie,allari naresh and isha chawla

Now Comedy King Allari Naresh is busy with a new movie is the official remake of the Tamil flick Kalagalupu.

ఇషా చావ్లాకు బంపర్ ఆఫర్

Posted: 11/07/2013 08:30 PM IST
Isha chawla in allari naresh film

టాలీవుడ్ లోకి సునీల్ సినిమా పూలరంగడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న భామ ఇషా చావ్లా ఆ తరువాత కూడా ఆయనతోనే మరో సినిమాలో, బాలక్రిష్ణతో ఓ సినిమా లో నటించినా అవకాశాలు రాబట్టుకోవడంలో విఫలం అయింది. అరంగ్రేటమే కామెడీ హీరోతో చేయడంతోనే అవకాశాలు రావడం లేదని, సునీల్ ని నమ్ముకొని మోసపోయానని లోలోపల కుమిలి పోతున్న ఇషాను సునీల్ దూరంగా పెట్టాడు.

ఇప్పుడు ఈమెను అల్లరి నరేష్ చేరదీశాడు. ఈయన సరసన తొలిసారిగా జతకట్టడానికి సిద్దం అయింది. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో తమిళ 'కలగలపు' చిత్రం సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమాలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇందులో అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఇందులో ఒక పాత్ర మాస్, మరొకటి క్లాస్ పాత్ర అని దర్శకుడు సత్తిబాబు చెప్పారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సినిమా తరువాత అయినా ఇషాకు అవకాశాలు తలుపుతడతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles