Ss rajamouli crop damaged by heavy rains

ss rajamouli crop damaged by heavy rains, director rajamouli, jakanna,bahubali, crope, farmer.

ss rajamouli crop damaged by heavy rains, director rajamouli, jakanna,bahubali, crope, farmer.

పంటనష్టం బాధితుల్లో ఎస్.ఎస్. రాజమౌళి

Posted: 10/31/2013 01:44 PM IST
Ss rajamouli crop damaged by heavy rains

ఈ మధ్యన అల్పపీడనానకి తోడు, ఈశాన్య రుతుపవనాలు బలంగా కలదలడంతో గత నాలుగైదు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షానికి రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ విపత్తుకు మంది రైతులు నష్టపోయారు. అందులో దర్శక ధీరడు రాజమౌళి కూడా ఉన్నాడు. ఆయనెప్పుడు వ్యవసాయం ప్రారంభించాడని అనుకోకండి. ప్రస్తుతం ఆయన ‘బహుబలి ’ సినిమా షూటింగులో బీజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఓ సన్నివేశం వర్జినాలిటీగా చిత్రీకరించడం కోసం ఓ రైతు దగ్గర కొంత పొలాన్ని లీజుకు తీసుకొని మొక్కజొన్న పంటను ఆ రైతు ద్వారా వేయించాడట.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ పంట పూర్తిగా నాశనం అవ్వడంతో రాజమౌళి తెగ భాధ పడిపోయాడట. తాను ఎంతగానో అభిమానించి పెంచిన క్రాప్ వర్షపు నీటికి పాడైపోవడంతో షాక్ కు గురైన రాజమౌళి షూటింగ్ కోసం వేసిన పంట కోసమే ఇంత బాధగా ఉంటే, సర్వం పంటల్నే నమ్ముకున్న రైతులకు ఇంకెంత బాధ ఉంటుందో అని విచారం వ్యక్తం చేశాడట. ఏమైనా ఇటు రైతుల పంట, అటు రాజమౌళి పంట పోవడం కాస్త బాధకరమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles