Sridevi daughter jhanvi kapoor make her film debut soon

jhanvi kapoor debut soon, Jhanvi Kapoor film debut, Jhanvi Kapoor South film offers, Sridevi, Sridevi Kapoor

Sridevi daughter Jhanvi Kapoor make her film debut soon.

శ్రీదేవి కూతురు ఎంట్రీ ఖరారు ?

Posted: 09/19/2013 11:52 AM IST
Sridevi daughter jhanvi kapoor make her film debut soon

సినిమా ఇండస్ట్రీలో తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని వెండితెర పై అరంగ్రేటం చేసి స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు. ఇప్పుడు వారి బాటలోనే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయిన జాహ్నవి కూడా వెండితెర పై అరంగ్రేటం చేయబోతుంది. ఈమె వెండితెర ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వార్తలు మరింత ఊపందుకున్నాయి బాలీవుడ్ లో. త్వరలో ఈమె ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ దర్శకత్వంలో తన డెబ్యూట్ సినిమా చేయబోతుందని, దీనికి సంబంధించి భోనీ కపూర్ అతనితో చర్చలు కూడా జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. జాహ్నవిని తమ సినిమాలో నటింపజేసేందుకు టాలీవుడ్ యువ హీరోలు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఓపక్క చదువుకుంటూ ... మరోపక్క డ్యాన్స్ నేర్చుకుంటూ జాహ్నవి బాడీ షేప్స్ తెచ్చుకోవడం కోసం జిమ్ లో వ్యాయామాలు కూడా చేస్తోంది. ఇక శ్రేదేవి సైతం వివిధ కార్యక్రమాలకు చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని, కూతురుకు కూడా వేయించి సినిమాల్లోకి రావడానికి మేం రెడీ అనే సంకేతాలు ఇండైరెక్ట్ గా పంపుతుంది. కూతుర్ల కోసం శ్రీదేవి పడుతున్న తాపత్రయం చూసైనా ఎవరైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles