Pawan and krish to team up for ko bali

Pawan and Krish to team up for ko bali, Krish to direct a movie with pawan kalyan on Pawan kalyan Creative works banner,Pawan Kalyan, Krish New Movie Title,Pawan Kalyan ko bali,Pawan Kalyan Upcoming Movie Tittled.

Pawan and Krish to team up for ko bali, Krish to direct a movie with pawan kalyan on Pawan kalyan Creative works banner,Pawan Kalyan, Krish New Movie Title,Pawan Kalyan ko bali,Pawan Kalyan Upcoming Movie Tittled.

‘కో..బలి ’ దర్శకుడు క్రిష్

Posted: 09/11/2013 09:42 PM IST
Pawan and krish to team up for ko bali

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. ఆయన గురించి ఏ విషయం బయటికి వచ్చినా హాట్ టాపికే అవుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో ఈనెల 20 తేదీ నుండి ‘గబ్బర్ సింగ్ -2 ’ చిత్రం షూటింగులో పాల్గొన బోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అప్పగించారట. ఇక ఆ విషయం ప్రక్కన పెడితే పవన్ కళ్యాణ్ గురించి టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. సంపత్ నంది తో చేసే చిత్రం తరువాత క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నాడట. క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చకున్న క్రిష్ డైరెక్ట్ చేసిన 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం టేకింగ్ స్టైల్ ఆయన్ను బాగా ఆకట్టుకోవడంతో, ఆయనతో ఓ సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడట. తనకెంతో ఇష్టమైన 'కో ... బలి ' స్క్రిప్టును క్రిష్ చేతిలో పెట్టనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ స్థాపించబోతున్న బేనర్ లో నిర్మించబోతున్నాడని, ఇదే కాకుండా ఈ బేనర్ లో చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయని అంటున్నారు. చూద్దాం క్రిష్ కి ‘కోబలి ’ చేసే ఛాన్స్ దక్కుతుందో లేదో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles